● భక్తులతో కిటకిటలాడిన జాన్కంపేట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం
● అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు
బోధన్: శని అమావాస్యను పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం భక్తులతో శనివారం కిటకిటలాడింది. తెల్లవారుజాము నంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, గ్రామపెద్దలు ఎ మ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నీడ కోసం టెంట్లు వేశారు. తాగునీరు, మజ్జిగ, గుట్టకింద ప్రాంతంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధాకిషన్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకుడు విజయకుమార్‌గౌడ్, ఆలయ ఈవో వేణు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో వెళ్తున్న ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి
అష్టముఖి కోనేరు చుట్టూ భక్తుల సందడి


