అనుమతి రావాల్సి ఉంది
● కొత్త పెన్షన్‌లకు లభించని మోక్షం
● 2022లో నిలిచిన ప్రక్రియ
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం సుంకెట్ కు చెందిన రమ్య భర్త గంగాధర్ అనారోగ్యంతో ఐ దేళ్ల క్రితం మరణించాడు. ఇంటి పెద్దదిక్కును కో ల్పోయిన రమ్య.. పిల్లలను బతికించుకోవడానికి వ్యవసాయ పనులకు వెళ్తోంది. రోజూ కష్టపడితేనే తిండిదొరికే పరిస్థితి ఆ కుటుంబానిది. వితంతు పింఛన్ కోసం రమ్య ఐదేళ్లుగా గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంది.
ఇలా ఎంతో మంది అర్హులైన వితంతులు, వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ కోసం ఎదురు చూస్తూ నే ఉన్నారు. 2022లో పింఛన్‌ల మంజూరు ప్రక్రి య నిలిచిపోగా.. గతేడాది బడ్జెట్ ప్రసంగంలో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన పింఛన్‌లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ కొత్త పింఛన్‌ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాలేదు. పింఛన్లకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హోల్డ్‌లో పెట్టారు. కొత్త పింఛన్‌ల విష యంలో ఏదో ఒక సందర్బంలో మంత్రులు ప్రకటనలు చేస్తున్నా మార్గదర్శకాలు మాత్రం జారీ కావ డం లేదు. కేవలం స్పౌజ్ ఆప్షన్ మాత్రమే పని చే స్తోంది. జిల్లాలో ప్రస్తుతం 2.69 లక్షల వివిధ రకాల పింఛన్‌లు అందుతుండగా, గతంలో ఆన్‌లైన్ చేసిన దరఖాస్తులు సుమారు 25వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 40 వేలకుపైగా ఉండొచ్చని అంచనా.
కొత్త పింఛన్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేస్తే గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తులను సేకరిస్తాం. వెబ్ ఆప్షన్ ఇస్తే నే ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకూ వేచి ఉండాలి.
– తిరుమల, ఎంపీడీవో మోర్తాడ్


