16 ఏళ్లుగా 100 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

16 ఏళ్లుగా 100 శాతం ఉత్తీర్ణత

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

అందరి సహకారంతోనే..

ఎస్సెస్సీ ఫలితాల్లో హాసాకొత్తూర్‌

జెడ్పీహెచ్‌ఎస్‌ ఘనత

ప్రత్యేక తరగతులు, వెనుకబడిన

విద్యార్థులపై టీచర్ల ప్రత్యేక శ్రద్ధ

మోర్తాడ్‌: కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు 16 ఏళ్లుగా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ రికార్డును సృష్టించారు. 2010–2011 విద్యా సంవత్సరంలో మొ దలైన వంద శాతం ఉత్తీర్ణత నమోదు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. 2025–26 విద్యా సంత వ్సరానికి గాను వంద శాతం ఉత్తీర్ణతను విద్యార్థు లు సాధించడంతో అందరి దృష్టి ఈ పాఠశాలపై ని లిచింది. ఈసారి 19 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఎక్కు వ మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించడం విశేషం. సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక తరగతుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించడంతో వంద శాతం ఫలితాలు సాధ్యమయ్యాని ఉపాధ్యాయులువెల్లడించారు. ఇదే స్ఫూ ర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతామన్నారు.

మరిన్ని పాఠశాలల్లో...

కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్‌, బషీరాబాద్‌, చౌట్‌పల్లి, అమీర్‌నగర్‌ పాఠశాలల్లోను వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన పాఠశాలల్లో ఒకరిద్ద రు విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులలో తప్పడంతో వంద శాతం ఫలితాలు సాధ్యం కాలేదు. ప్రభుత్వ బడు ల్లోని విద్యార్థులు ప్రైవేటు బడుల విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈసారి అడ్మిష న్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పదో తరగతి పరీక్షల్లో మా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఉ పాధ్యాయుల కృషి, గ్రామ స్తు లు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకారం అందించడంతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం.

–తిరునగిరి అరుణశ్రీ, హెచ్‌ఎం, హాసాకొత్తూర్‌

Advertisement
 
Advertisement
Advertisement