జీవన్‌రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో | - | Sakshi
Sakshi News home page

జీవన్‌రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని విమర్శించే అర్హత ఆ ర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి లేదని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి నీచ రాజకీయాలకు మారుపేరన్నారు. సుదర్శన్‌రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్‌ కార్యకర్తలు ఊరుకోర న్నారు. ఇక మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రైతుల ముసుగులో పచ్చ కండువాలు వేసు కుని ధర్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హా మీని నెరవేర్చేలా ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5.82 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాకు 70 వేల మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలుకు అనుమతి వస్తే ఇప్పటికే 50 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారన్నా రు. అలాగే 32 కొనుగోలు కేంద్రాల ద్వారా 38,556 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దన్నా రు. సుదర్శన్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, భూపతిరెడ్డి నిరంతరం కలెక్టర్‌తో, ప్రభుత్వ అధికారులతో సమీక్షలు చేస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నార న్నారు. డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షు లు కౌడపు శరత్‌ కుమార్‌, రత్నాకర్‌గౌడ్‌, జిల్లా ప్రఽ దాన కార్యదర్శి ప్రవీణ్‌గౌడ్‌, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు విపుల్‌ గౌడ్‌, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజనరేందర్‌గౌడ్‌, జిల్లా ఫిషరీస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఏఎంసీ డైరెక్టర్‌ రఘు, రమేష్‌ పాల్గొన్నారు.

సామాన్యులపై పెట్రో భారం

నిజామాబాద్‌ రూరల్‌: పెట్రోల్‌, డిజిల్‌ ధరలను పెంచి సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం భారం మోపిందని నగేశ్‌రెడ్డి విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

సుదర్శన్‌రెడ్డిని విమర్శించే

స్థాయి నీకు లేదు

ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే

మొదటిస్థానంలో జిల్లా

డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement