ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆల్ఫోర్స్ విద్యార్థులు ఎప్‌సెట్ ఫలితాల్లో విజయఢంకా మోగించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ విఠల్‌రావు తెలిపారు. ఆదివారం విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ప్రత్యేక తరగతులు, అధ్యాపకుల కృషితో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపా రు. సాయిబా సమ్రాన్ (5627), సీహెచ్. ప్రణవి (7921), డి.అక్షయ (8758), శ్రీవర్షిణి (9511), ఎం.యోగేష్ (10934), టి.లకిత (12227), జె.గోపిక (14202), పి.శ్రీహిత (14512), జి.లోక్య (17436), ఆర్ అపర్ణ (18552) ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అభినందించారు.


