బోధన్‌టౌన్/బోధన్: పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకొని 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మిర్జా జుబేర్ బేగ్ బోధన్‌కు వస్తున్నట్లు ఈగల్ టీం సమాచారం మేరకు కొత్త బస్టాండ్‌లో పట్టుకున్నామన్నారు. నిందితుడిని విచారించగా మిర్జా జుబేగ్ బేగ్ గంజాయి సరఫరా చేస్తాడని, ఈ నెల 11న అరెస్టయి జైలులో ఉన్న ధనుష్‌కు నాందేడ్‌లో 1 కేజీ 660 గ్రాముల గంజాయి విక్రయించినట్లు తెలిపారు. మిర్జా జుబేగ్ బేగ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు. గంజాయి పట్టుకున్న ఎస్సై హబీబ్ ఖాన్, సిబ్బంది మహేశ్, గంగారాం, వరుణ్, ఈగల్ ఆర్‌ఎస్‌సీసీ టీం నిజామాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించినట్లు సీఐ తెలిపారు.


