మోపాల్: మండలంలోని బోర్గాం(పి) శివారులో చెట్టు కొమ్మ విరిగి పడి మంచిప్ప గ్రామానికి చెందిన వాహనదారుడు భూమన్నకు బుధవారం గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. బోర్గాం శివారులో వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. రాత్రంతా కాలిన మంటలు కాస్త రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు అంటుకున్నాయి. నిజామాబాద్ నుంచి బైక్‌పై భూమన్న వెళ్తుండగా అదే సమయంలో చెట్ల కొమ్మలు ఆయనపై పడ్డాయి. ప్రమాదంలో భూమన్నకు గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు.


