బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు చెక్‌పోస్టును పరిశీలించిన ఏసీపీ వేతనాల పెంపుదల చర్చలు సఫలం

ఇందల్వాయి: మండలంలోని మేఘ్యనాయక్‌ తండాలో గురువారం రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తహసీల్దార్‌ బాలయ్య తెలిపారు. పెళ్లి నిలిపివేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లలోపు అమ్మా యిలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఎంపీడీవో అనంత్‌ రావు, సర్పంచ్‌ బంతిలాల్‌ నాయక్‌, ఎస్సై సందీప్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శోభ తదితర సిబ్బంది ఉన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని మల్లారం మేఘన డెంటల్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక చెక్‌పోస్టును ఏసీపీ ప్రకాశ్‌ యాదవ్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల ధృవపత్రాలను పరిశీలించాలని రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బందికి సూచించారు.

ఫ్లెక్సీల తొలగింపు

రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సీపీ ఆదేశాల మేరకు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బంది తొలగించారు. వాహనదారులకు, రోడ్డుకు అడ్డంగా ఉండి ఇబ్బందికరంగా ఉన్న ఫ్లెక్సీలను తీసివేశారు.

నిజామాబాద్‌ రూరల్‌: బీడీ పరిశ్రమలోని వివిధ కేటగిరీలకు చెందిన కార్మికుల నూతన వేతన ఒప్పందంపై నిర్వహించిన చర్చలు సఫలమైనట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు.హైదరాబాద్‌లోని స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బీడీ పరిశ్రమ యా జమాన్యాలకు, బీడీ కార్మిక సంఘాలకు మధ్య గురువారం చర్చలు జరిగాయి. బీడీ ప్యాకర్లకు రూ.4,500, ఇతర నెలసరి వేతన ఉద్యోగులకు రూ.2,200, బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.6 పెంపుదలకు యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చర్చల్లో బీడీ యాజమాన్యాల అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు హితేంద్రకుమార్‌, ధర్మేంద్రగాంధీ, కార్మిక సంఘాల ప్రతినిధులు మామిడ్యాల వెంకటి, రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ రూరల్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభచాటిన, సేవలందించిన వారిని సత్కరించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ‘ఆల్‌ దిబెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ’ అధ్యక్షుడు ఈఎస్‌ఎస్‌ నారాయణ మాస్టారు ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయిత లు, సంగీత, నృత్య, కళాకారుల, ఉపాధ్యాయు ల, విద్యావంతులు, వైద్యుల, సమాజ సేవకులు తదితర రంగాల్లోని ప్రతిభావంతులు ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్‌ జిరాక్స్‌ కాపీలతో ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9652347207 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement