మోపాల్: రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరు మోహన్‌రెడ్డి అన్నారు. జన గణన శిక్షణ కేంద్రంలో ఉద్యోగులకు అన్ని సదుపాయాలు కల్పించినందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న జనగణన శిక్షణా కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తారని, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందజేస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం అధికారి సాయికృష్ణ, మాస్టర్ ట్రైనర్స్ దయానంద్, శేఖర్‌ను మోహన్‌రెడ్డి సన్మానించారు. తహసీల్దార్ రేఖ, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గోపిడి రవీందర్‌రెడ్డి, ఎంఈవో అమ్దాపూర్ సాయిలు, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు కొట్టూరు దేవీదాస్, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్, ఎండల మహేందర్, మండల అసోసియేట్ అధ్యక్షులు కడావత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


