ఆలూర్‌లో లారీ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఆలూర్‌లో లారీ బీభత్సం

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

విద్యుత్‌ స్తంభాలు,

ట్రాన్స్‌ఫార్మర్లను ఢీకొన్న లారీ

ఆర్మూర్‌టౌన్‌: ఆలూర్‌ మండల కేంద్ర సమీపంలో లారీ విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ఢీకొని బీభత్సం సృష్టించింది. నల్లమట్టిని తీసుకువచ్చేందుకు ఆలూర్‌ నుంచి వెల్మల్‌ మీదుగా నందిపేట్‌ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. అడ్డం వచ్చిన చెట్లు, ఆరు విద్యుత్‌ స్తంభాలు, రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఢీకొట్టింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటన సమయంలో పొలాల్లో రైతులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కాగా, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సమీపంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఏడీఈ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మతులు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement