● బోధన్ ఆర్డీవో విజయకుమారి
● హున్సాలో మొక్కజొన్న
కొనుగోలు కేంద్రం పరిశీలన
బోధన్: రైతులు పండించిన మొక్కజొన్న కొనుగో లు ప్రక్రియను మరింత వేగవంతంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని బోధన్ ఆర్డీవో విజయకుమారి భరోసా ఇచ్చారు. సాలూర మండలంలోని హున్సా ప్రాథమిక వ్యవసాయ సహకారం అ ధ్వర్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతి, మండల అధికారులతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. రైతువేదిక భవనం ఆవరణలో ని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిల్వ చేసిన మొ క్కజొన్న దిగుబడులను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవాణా, పాత గోనె సంచుల సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం హున్సా సహకార సంఘం చైర్మన్ రవి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి మొక్కజొన్న రైతుల ఇబ్బందులను తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని కలెక్టర్‌తో మాట్లా డారని చైర్మన్ తెలిపారు. సహకార సంఘం చైర్మన్ మందర్నా రవి, తహసీల్దార్ నవాజ్, ఏవో శ్వేత, సొసైటీ సీఈవో హన్మంత్‌రావు, రైతులు ఉన్నారు.


