రెంజల్(బోధన్): విద్యతోనే సమాజంలో మార్పు, మనుగడ సాధ్యపడుతుందని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని కందకుర్తి గ్రామంలో గురువారం ఎస్‌బీఐ సహకారంతో కేశవ శిశు విద్యామందిర్, కోల్ ఇండియా సహకారంతో కేశవ నైపుణ్య వికా సం కేంద్రం నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేశవ శిశు మందిర్‌తోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువత, విద్యార్థులు, రైతులకు ఉపయోగపడేలా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్య, వికాసంతో యువ త అన్ని రంగాల్లో రాణించడంతోపాటు ప్రతి ఒక్క రు విద్యావంతులైనప్పుడు అంటరానితనం, కుల వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని పేర్కొన్నారు. కేశవ శిశుమందిర్ విద్యాలయాలు నిరుపేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూనే ఇతర రంగాల్లోని వ్యక్తులకు శిక్షణ అందిస్తూ ఆర్థికంగా రాణించేలా చేస్తున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ సేవా భారతి అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి రేణుక పాఠక్, కేశవ సేవా సమితి అధ్యక్షుడు చామకూర సుధాకర్‌రెడ్డి, కేదార్‌నంద మహరాజ్, సీతారాం త్యాగి మహరాజ్, సేవా భారతి తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రెడ్డి, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ పర్వీన్, ప్రాజెక్టు మేనేజర్ ఇప్సిత దత్త, జిల్లా సేవాభారతి అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


