డిచ్‌పల్లి : డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుద్దపల్లి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సాయంత్రం నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఎండిపోయిన గడ్డి, పిచ్చి మొక్క లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించా యి. సమీపంలో ఇళ్లు ఉండటం, మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఫైర్ స్టే షన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థ లానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అరగంటపా టు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.


