తీరనున్న గేట్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తీరనున్న గేట్‌ కష్టాలు

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

ఇందల్వాయి: ఇందల్వాయి, సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఇందల్వాయి మండల కేంద్రంలోని రైల్వే గేటుపై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిర్ణయించడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీంగల్‌, సిరికొండ, ధర్పల్లి, ఇండల్వాయి మండలాలకు చెందిన వేలాది మంది నిత్యం నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌ వెళుతుంటారు. 44 నెంబర్‌ జాతీయ రహదారి మీదుగా వెళ్లే ఈ ప్రాంతాలను చేరుకోవాలంటే ఇందల్వాయి రైల్వే గేటు దాటాల్సిందే. ఈ రైల్వే మార్గం గుండా నిత్యం 50 పైగా ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లు వెళుతుంటాయి. ఈ క్రమంలో రోజుకు కనీసం 50 సార్లు గేటుని మూసేస్తారు. గేటు పడ్డ ప్రతిసారి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. రెండు పక్కల వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి తీవ్రమైన ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతుంది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

జాప్యం లేకుండా నిర్మించాలి

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కో సం త్వరగా భూ సేకరణ పూర్తి చేసి, పను లు వేగంగా పూర్తి చే యాలి. మాధవ నగర్‌ ఆర్వోబీ లాగా పనులు ఆలస్యంగా జరిగితే ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలా జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. – ఎం శ్రీనివాస్‌, ఇందల్వాయి

ఆదేశాలు రాగానే భూసేకరణ

ఆర్వోబీ నిర్మాణం కోసం పైఅధికారుల నుంచి ఆదేశాలు రాగానే సంబంధిత అధికారులతో కలిసి భూమి సర్వే భూసేకరణ పనులు ప్రారంభిస్తాం.

– బాలయ్య, తహసీల్దార్‌ ఇందల్వాయి

Advertisement
 
Advertisement
Advertisement