రోడ్డు ప్రమాదంలో శిశువు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో శిశువు మృతి

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

రోడ్డు ప్రమాదంలో శిశువు మృతి

వర్ని: మోస్రా గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల శిశువు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి మల్లారం గ్రామానికి చెందిన జర్పుల దశరథ్‌ భార్య నిరోషా, మూడు నెలల శిశువుతో నిజామాబాద్‌ నుంచి స్వగ్రామమైన మల్లారానికి కారులో వస్తోంది. మోస్రా శివారులో అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో కారు పొలాల్లో దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో మూడు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందగా, నిరోష తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

భర్తను చంపిన భార్య

హత్యకు సహకరించిన కొడుకు

నందిపేట్‌(ఆర్మూర్‌): కట్టుకున్న భర్తను కొడుకు సహాయంతో హత్య చేసిన ఘటన నందిపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జానారెడ్డి, నందిపేట ఎస్సై శ్యామ్‌రాజ్‌ శుక్ర వారం తెలిపారు. నందిపేట మండలం మాయాపూర్‌ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం(44) ఈ నెల 6న మృతి చెందాడు. మద్యం మత్తులో మంచంపై నుంచి కిందపడి చనిపోయాడని మృతుడి భార్య లలిత చెప్పడంతో కుటుంబసభ్యులకు అనుమానం కలిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తామే హత్య చేసినట్లు ఒప్పకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు ముత్యంకు ఉన్న వివా హేతర సంబంధం కారణంగా ఇంట్లో తరుచూ గొ డవలు జగుతుండేవని మృతుడి భార్య లలిత తెలిపింది.ఎంత చెప్పినా అతనిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 5న రాత్రి మద్యం తాగి ఇంట్లో ని ద్రిస్తున్న సమయంలో ముత్యం మెడకు చీర అంచుతో బిగించగా కొడుకు కాళ్లు కదలకుండా పట్టుకొని సహకరించాడని, దీంతో తన భర్త మృతి చెందాడని పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది. శుక్రవారం నిందితులు లలిత, ఆమె కుమారుడిని కోర్టులో హాజరుపరచినట్లు సీఐ జానారెడ్డి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement