ఉద్యాన పంటలతో ఆర్థిక పరిపుష్టి | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటలతో ఆర్థిక పరిపుష్టి

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

పెర్కిట్‌(ఆర్మూర్‌): సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఉద్యాన పంటలను సాగు చేయ డం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని పసుపు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో మంగళవారం ఉ ద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహ న సదస్సు నిర్వహించారు. గంగారెడ్డి ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రైతులు తమకున్న సాగు భూమిలో అర ఎకరాలో కూరగాయలు చేయడం ద్వారా అదనపు ఆ దాయం పొందవచ్చన్నారు. అనంతరం రైతు వారోత్సవాల పరిశీలకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ అందజేస్తుందన్నారు. ప్రస్తుతం ఆర్మూర్‌ నియోజకవర్గంలో 620 మంది రైతులు 1,343 ఎకరాల్లో ఆ యిల్‌పామ్‌ పంటను సాగు చేస్తున్నట్లు తెలి పారు. దీంతో పాటు రైతులు కూరగాయలు, పండ్లు, పూలను సాగు చేసి అదనపు ఆదాయం పొందాలన్నారు. ఆర్మూర్‌ ఉద్యానవన శాఖ అధికారిణి సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు.

డీఆర్‌వోగా గీత

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా రెవెన్యూ అధికారిణిగా బి గీతను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న గీత నిజామాబాద్‌ డీఆర్‌వోగా రానున్నారు.

బోధన్‌ ఆర్డీవోగా విజయకుమారి

బోధన్‌: అడిషనల్‌ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హై దరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సేవరేజ్‌ బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ ఎం విజయకుమారి బోధన్‌ ఆర్డీవోగా నియమితులయ్యారు. సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో కొత్తగా డిప్యూటీకలెక్టర్‌ను ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పంట మార్పిడిపై

సీఎంకు నివేదిక

నిజామాబాద్‌ రూరల్‌: పంట మార్పిడి విధానాలపై సీఎం రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంగళవారం నివేదికను అందజేసినట్లు రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌ తెలిపారు. చైర్మన్‌ కోదండరెడ్డి నేతృత్వంలో సీఎంతో తాము సమావేశమై వివిధ అంశాలపై చర్చించామన్నారు. పంట మార్పిడిపైన ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని సీఎం పేర్కొన్నట్లు గడుగు తెలిపారు. మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలతో ఖరీఫ్‌ పంటపై తాము ముందుకు వస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement