వనమహోత్సవానికి సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

వనమహోత్సవానికి సన్నద్ధం

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వనమహోత్సవం–2026 కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో మొత్తం 26.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం 530 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 42 లక్షల మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్సరం ఒక్కో నర్సరీలో 8 వేల చొప్పున మొక్కలను పెంచగా, గతేడాదికి సంబంధించిన మొక్కలు ఉండడంతో ప్రస్తుతం ఒక్కో నర్సరీలో 2,600 చొప్పున మొక్కలను పెంచుతున్నారు. నాటేందుకు మొక్కలు సిద్ధం కావడంతో జూన్‌ మొదటి వారం నుంచి ఉపాధి కూలీలతో గుంతలు తవ్వించి జూలైలో వేగవంతంగా మొక్కలను నాటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

●ప్రధానంగా నీడనిచ్చే కానుగ, చింత, వేప, తెల్లమద్ది, పెల్ట్రోఫాం, డెకోమా చెట్లతో పాటు జామ, సీతాఫలం, అల్లనేరెడు, ఉసిరి, సపోటా, ఈత, ఖర్జూర, బాదం, నిమ్మ, దానిమ్మ తదితర పండ్ల మొక్కలు నాటనున్నారు. గన్నేరు, గులాబీ, మల్లె, మందార, కరివేపాకు తదితర మొక్కలను ఇంటికి ఐదు చొప్పున పంపిణీ చేయనున్నారు.

●రహదారుల వెంబడి, చెరువుగట్లు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైతుల భూముల్లో, దేవాలయ, అటవీ భూముల్లో, శ్మశాన వాటి కలు, తదితర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల మొక్కలను నాటనున్నారు.

లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వనమ హోత్సవాన్ని నిర్వహించనున్నాం. నిర్ధేశిత లక్ష్యాన్ని ప్రణాళికతో పూర్తి చేస్తాం. మొక్కలు నాటడానికి త్వరలో గ్రామా ల్లో ఉపాధి కూలీలతో గుంతలు తవ్వించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెడతాం.

– సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికలు

జిల్లా వ్యాప్తంగా 26.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

520 నర్సరీల్లో 42 లక్షల

మొక్కల పెంపకం

Advertisement
 
Advertisement
Advertisement