నిరాశ మిగిల్చిన నువ్వు | - | Sakshi
Sakshi News home page

నిరాశ మిగిల్చిన నువ్వు

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

మద్దతు ధరను మించినా

లాభం లేదంటున్న రైతులు

క్వింటాల్‌ ధర గతంలో రూ.16 వేలు.. ప్రస్తుతం రూ.10 వేలు దాటని వైనం

మోర్తాడ్‌(బాల్కొండ): నువ్వు సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,200 కాగా, ప్రస్తు తం మార్కెట్‌లో రూ.10వేల వరకు వ్యా పారులు చెల్లిస్తున్నారు. మద్దతు ధరకన్నా రూ.1800 వరకు ఎక్కువ లభిస్తున్నా తమకు నష్టమేనని రైతులు వాపోతున్నారు. గతంలో క్వింటాల్‌ ధర రూ.16 వేలకు పైగా పలికింది. అయితే అదే ట్రెండ్‌ కొనసాగుతుందని ఆశించి నువ్వు సా గు చేసిన రైతులకు నిరాశ ఎదురైంది. రెండు మూడేళ్ల క్రితం క్వింటాల్‌ ధర రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు ఉండడంతో యాసంగి సీజన్‌లో సజ్జకు పత్యామ్నాయంగా నువ్వునే సాగు చే స్తున్నారు. ఈ సీజన్‌లో దాదాపు 6 వేల ఎకరాల్లో నువ్వు సాగు చేశారు. క్వింటాల్‌కు రూ.15వేల వరకు ధర లభిస్తేనే ఎంతోకొంత ప్రయోజనం ఉండేదని రైతులు అంటున్నారు. వర్షం కారణంగా పంట దిగుబడి తగ్గిందని వాపోతున్నారు. దిగుబడి ఎక్కువ వచ్చిన చోట్ల ధర ఎలా ఉన్నా ఆదాయం పరవాలేదంటున్నారు. దిగుబడి తగ్గిన చోట మాత్రం నష్టం తప్పలేదంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement