నానో యూరియా వినియోగానికి రైతుల మొగ్గు
● తక్కువ ఖర్చు.. మంచి దిగుబడులు
● ఎరువు కొరతను తాము
ఎదుర్కోలేదంటున్న రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా బస్తాలకు క్రమంగా రైతులు దూరమవుతున్నారా? అంటే అవుననే చెప్పొచ్చు. రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతింటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం, ఇఫ్‌కో వంటి సంస్థలు నానో యూరియాను అందుబాటులోకి తెచ్చాయి. మొదట్లో నానో యూరియా వినియోగానికి అంతగా ఆసక్తి చూపని రైతులు క్రమంగా దాని ప్రధాన్యతను తెలుసుకుంటున్నారు. గతంలో 45కిలోల బస్తాలను మోయలేక ఇబ్బంది పడిన వారు ఇప్పుడు కేవలం ఒక బాటిల్‌తోనే పని పూర్తి చేసుకుంటున్నారు. నానో యూరియా అందుబాటులోకి రావడంతో ఎరువుల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని అంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసినప్పటికీ రానున్న వానకాలం సీజన్‌లో బస్తాల ఎరువు కొరత ఏర్పడే అవకాశాలున్న నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను తెచ్చే ‘నానో యూరియా’నే ప్రత్యామ్నాయంగా వినియోగించాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 10వేలమంది రైతులు 50వేల ఎకరాలకు పైగా నానో యూరియా, నానో డీఏపీ వినియోగించి పంటలు సాగు చేస్తున్నారు. మంచి ఫలితాలు సాధించిన పలువురు రైతులు వీరే..


