చట్టాన్ని అతిక్రమించొద్దు | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని అతిక్రమించొద్దు

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

చట్టాన్ని అతిక్రమించొద్దు ఉషూ పోటీల్లో కాంస్య పతకం దరఖాస్తులు స్వీకరించిన అబ్జర్వర్‌ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

ఇందల్వాయి: గన్నారం గ్రామంలోని 853 సర్వే నంబర్‌ స్థల వివాదంపై ఏసీపీ ప్రకాశ్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌ తహసీల్‌ కార్యాలయంలో గ్రామస్తులతో గురువారం సమావేశమయ్యా రు. వీడీసీ సభ్యులు, మాదిగ కులస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాదాస్పద స్థలంపై రెవెన్యు అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ స్థలంలో గ్రామస్తులెవరూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి, అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తే సహించబోమని తెలిపారు. సమావేశంలో డిచ్‌పల్లి సీఐ వినోద్‌, ఎస్సై సందీప్‌, తహసీల్దార్‌ బాలయ్య, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: ఆలిండియా యూనివర్సిటీ ఉషూ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి ఫరియాకనమ్‌ కాంస్య పతకం సాధించింది. జమ్మూ కశ్మీర్‌లో ఈ నెల 4 నుంచి 9 వరకు పోటీలు జరిగాయి. ఫరియాకనమ్‌ గతంలో రుమోనియా, రష్యా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించింది. ఉషూ కోచర్‌ అబ్దుల్‌ఉమెర్‌ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటుంది.

నిజామాబాద్‌ రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌, కార్యవర్గ పదవులకు జిల్లా పరిశీలకుడు చుక్కా శ్రీనివాస్‌ నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో గురువారం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌తోపాటు కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ లింగం, నగర చైర్మన్‌ వినయ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు విపుల్‌ గౌడ్‌, రాజ్‌ గగన్‌, రాజేశ్‌, దేగాం ప్రమో ద్‌, శాంతి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

బక్రీద్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఎస్పీ రాజేష్‌ చంద్ర

కామారెడ్డి క్రైం: బక్రీద్‌ పండుగ నేపథ్యంలో శాంతి భ ద్రతలకు ఎలాంటి విఘా తం కలగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేష్‌ చంద్ర గురువారం తెలిపారు. జిల్లాలో 6 ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనాలు ఆపడం, తనిఖీలు చేయ డం లాంటి అధికారాలు కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటాయన్నారు. వ్యక్తులు గానీ, సంస్థలు గానీ తనిఖీలకు దిగడం నిషేధమని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టు లు పెట్టినా చర్యలు తప్పవన్నారు. అలాంటి వాటిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రజలందరూ సోదరభావంతో మెల గాలని కోరారు. ఎక్కడైనా శాంతికి విఘాతం కలిగించే అంశం ఏదైనా ఉంటే వెంటనే పోలీసుల(హెల్ప్‌లైన నంబర్‌– 87126 86133 )కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగానీ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్‌ 100కు ఫోన్‌ చేయాలన్నారు.

మహిళాసంఘాల ద్వారా

పసుపు విక్రయించండి

నిజామాబాద్‌అర్బన్‌: పసుపును మహిళా సంఘాల ద్వారా ప్రతి ఇంటికి విక్రయించా లని పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం చై ర్మన్‌ తిరుపతిరెడ్డి గురువారం డీఆర్డీవో సా యన్నకు విన్నవించారు. సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన పసుపు ప్యాకెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమికల్స్‌ లేకుండా తయారు చేసిన పసుపు ప్రతి ఇంటికి అందిదే బాగుంటుందన్నారు. త్వరలోనే పసుపు పరిశ్రమను సందర్శించి మహిళా సంఘాల ద్వారా కల్తీలేని కె మికల్‌ లేని పసుపును ప్రతి కుటంబానికి చే రడానికి సహకరిస్తామని డీఆర్డీవో అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement