సుభాష్‌నగర్: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న పీఎం రాహత్ స్కీం త్వరలో జిల్లాలో అమ లు కానుందని డీఎంహెచ్‌వో రాజశ్రీ , ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఐఎంఏ మీటింగ్ హాల్ లో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులకు పీఎం రాహత్ స్కీంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్కీంలో ప్రతి యాక్సిడెంట్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల వరకు లేదా ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని, ఈ ఆస్పత్రుల సహకారం ఉండాలన్నారు.
ఈ – దార్ మేనేజర్ వర్షా నిహంత్ మాట్లాడుతూ.. పీఎం రాహత్ స్కీంలో పోలీస్, వైద్యారోగ్య విభాగం సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్, కార్యదర్శి సృజన్, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్‌రెడ్డి, వివిధ ఆస్పత్రుల సిబ్బంది పాల్గొన్నారు.
డీ–54 కాలువ
ఆక్రమణలను తొలగించాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలోని డీ–54 కాలువ ఆక్రమణలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆదేశించారు. నగరంలోని 18, 33వ డివిజన్‌లలో శనివారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ వర్కర్ల అ టెండెన్స్, శానిటేషన్ పనులు, తాగునీటి సరఫరా, డ్రెయినేజీలు, యూజీడీ పనులను పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభం కాను న్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా డీ–54 కాలువను పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్లు, నాయకులు ఆయనను కలిసి సమస్యలను వివరించారు. భారీ వర్షా లు కురిసిన సమయంలో నీటి ప్రవాహం పెరిగి ఇళ్లల్లోకి నీరు రావొచ్చని, డీ–54 కెనా ల్ ఆక్రమణల తొలగింపులో రాజీ పడొద్దని కమిషన్ సూచించారు. కార్పొరేటర్లు, నాయకులు సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కాలనీవాసులు ఉన్నారు.
443 మంది
విద్యార్థుల గైర్హాజరు
ఖలీల్‌వాడి: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. నాల్గో రోజైన శనివారం ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు మొత్తం 443 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 7,922 మంది విద్యార్థులకు గాను 7,577మంది హాజరుకాగా, 345మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే సెకండియర్ పరీక్షలకు 2,227 మంది విద్యార్థులకు గాను 2,129మంది హాజరుకాగా, 98 మంది గైర్హాజరయ్యారని వివరించారు.


