ఆధునిక భారత్‌ నిర్మాణానికి రాజీవ్‌గాంధీ కృషి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక భారత్‌ నిర్మాణానికి రాజీవ్‌గాంధీ కృషి

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

నిజామాబాద్‌ రూరల్‌: ఆధునిక భారత దేశ నిర్మాణానికి రాజీవ్‌గాంధీ కృషి చేశారని, ఆ యన దూరదృష్టి నేటి యువతకు ప్రేరణగా నిలుస్తోందని డీసీసీ, కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షులు నగేష్‌రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఇటీవల తమిళనాడులోని చైన్నె నుంచి బయల్దేరిన రాజీవ్‌ మెమోరియల్‌ జ్యోతియాత్రకు ఆదివారం వారు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగేశ్‌రెడ్డి మా ట్లాడుతూ రాజీవ్‌ గాంధీ సేవలను దేశం గ ర్వంగా స్మరించుకుంటోందని, ఆయన తన పాలనలో టెలికమ్యూనికేషన్‌, సాంకేతిక విజ్ఞానం, విద్యా రంగాల్లో కీలక సంస్కరణ లు చేపట్టి ఆధునిక భారత నిర్మాణానికి బ లమైన పునాది వేశారన్నారు. యువత సాధికారత, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్ర గీత కార్మికుల కార్పొరేషన్‌ చైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్‌, రఘు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి టూరిజం వీక్‌ సెలబ్రేషన్స్‌

సుభాష్‌నగర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు టూరిజం వీక్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికా రి పవన్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎక్స్‌ఫ్లోర్‌ తెలంగాణ – ఎక్స్‌పీరియన్స్‌ ది వరల్డ్‌’ అనే నినాదంతో నిర్వహించనున్న వారోత్సవాల ద్వారా తెలంగా ణ రాష్ట్ర పర్యాటక వైభవం, వారసత్వ సంప ద, ప్రకృతి సౌందర్యం, పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను ప్రజలకు పరిచయం చేయ డం లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నా మని పేర్కొన్నారు. 18న యువ టూ రిజం క్లబ్‌ల ఏర్పాటు, పోస్టర్‌ విడుదల, 19న ప ర్యాటక అవగాహన ర్యాలీ, ప్రచార కార్యక్రమం, 20న హెరిటేజ్‌ వాక్‌, 21న టూ రిజం ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లతో సమావే శం, 22న స్వచ్ఛతాకార్యక్రమాలు, 23న బ్రాండ్‌ కిట్‌ పోస్టర్‌ విడుదల కార్యక్రమం ని ర్వహిస్తామన్నారు. పర్యాటక అభిమానులు, విద్యార్థులు, యు వత, ట్రావెల్‌ బ్లాగర్లు, యూట్యూబర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పవన్‌కుమార్‌ కోరారు.

యోగా విజేతలకు బహుమతులు

సుభాష్‌నగర్‌: ఎన్‌ఎస్‌సీఎన్‌పీఎల్‌ ఆధ్వర్యంలో ఇటీవల నగరంలోని కాకతీయ ఒలంపియాడ్‌ స్కూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాసన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఆరోగ్య రక్ష యోగా నేచర్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌సీఎన్‌పీఎల్‌ ప్రతినిధులు హి తిన్‌ బీమాని, సీహెచ్‌ రజినీకాంత్‌, డీవైఎస్‌వో పవన్‌కుమార్‌, ఆరోగ్య రక్ష నిర్వాహకులు డాక్టర్‌ ఐశ్వర్య కాలే, సీహెచ్‌ గంగాధ ర్‌, యోగా గురువులు కమలవాణి, గాయ త్రి, లోహిదాస్‌ హాజరయ్యారు. పోటీలకు 250 మందికిపైగా హాజరయ్యారని, రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశామని యోగా అసోసియేషన్‌ సెక్రెటరీ గంగాధర్‌ తెలిపారు. క్రీడాకారులు, యోగా గురువులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement