● 17,789 మంది విద్యార్థులు..
39 సెంటర్లు
● ప్రైవేట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్‌అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం 17,789 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. ఫస్టియర్ విద్యార్థులు 11,425, సెకండియర్ విద్యార్థులు 6364 మంది ఉన్నారన్నారు. మొత్తం 39 సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యా హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ము ఖ్యంగా ప్రైవేట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడ కూడా కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, పోస్టల్, మెడికల్ అండ్ హెల్త్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
విద్యార్థులు ఆందోనళకు గురి కాకుండా ప్ర శాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ అధికా రి రవికుమార్, నిజామాబాద్ ఏసీపీ బి ప్రకాశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రేపు సీఎస్, డీవోల సమావేశం
ఖలీల్‌వాడి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఖిల్లా బా లుర జూనియర్ కళాశాలలో ఆదివారం చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు డీఐఈవో రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, 39 సెంటర్ల సీఎస్‌లు, డీవోలు హాజరుకావాలని సూచించారు. అలా గే అన్ని పోలీస్ స్టేషన్‌ల కస్టోడియన్‌లు సైతం సమావేశానికి హాజరు కావాలని కోరారు.


