నేటి నుంచి జనగణన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జనగణన

May 11 2026 7:20 AM | Updated on May 11 2026 7:20 AM

జూన్‌ 9 వరకు

కొనసాగనున్న ప్రక్రియ

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జనగణన ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తయ్యింది. జూన్‌ 9 తేదీ వరకు జనగణన ప్రక్రియ కొనసాగనుంది. మొదటి మూడు రోజులు ఎన్యుమరేటర్లు గృహాలను గుర్తిస్తారు. జనాభా లెక్కింపునకు ముందు అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలు, పట్టణాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయని గుర్తించి మార్కింగ్‌ చేసి మ్యాపింగ్‌ తయారు చేస్తారు. అనంతరం జనాభాను లెక్కిస్తారు. ఒక్కో ఎన్యుమరేటర్‌ 300 ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా జనగణన కోసం 33 మండలాల్లో 2,588 మంది ఎన్యుమరేటర్‌లను నియమించారు. అలాగే మూడు మున్సిపాలిటీల్లో 680 మంది ఎన్యుమరేటర్లు, 110 మంది సూపర్‌వైజర్లు జనగణన విధులను నిర్వర్తించనున్నారు.

13 నుంచి ఉచిత

క్రికెట్‌ శిక్షణ శిబిరం

కామారెడ్డి అర్బన్‌:/కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి క్రికెట్‌ అసోసియేషన్‌(కేసీఏ) ఆధ్వర్యంలో ఈనెల 13న ఉచిత వేసవి క్రికెట్‌ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు మోజామ్‌ అలీఖాన్‌, కార్యదర్శి ముప్పారపు ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్‌, నిజామాబాద్‌ క్రికేట్‌ అసోసియేషన్‌ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు బాల, బాలికలు, యువతీయువకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 13న నేరుగా స్టేడియానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పతకాల పంట

కామారెడ్డి అర్బన్‌: హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లె టిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మహిళల విభాగంలో కే.మేఘన జా వెలిన్‌ త్రోలో బంగారు పతకం, షాట్‌పుట్‌ లో కాంస్య పతకం సాధించగా, వై.శిరీష జా వెలిన్‌ త్రోలో కాంస్య పతకం పొందారు. అండర్‌–20 బాలుర విభాగంలో లాంగ్‌ జంప్‌ లో నందు, రాకేష్‌ వెండి పతకాలు, పవన్‌ క ళ్యాణ్‌ కాంస్య పతకం సాధించారు. అండర్‌–18 బాలికల విభాగం 400 మీటర్ల ప రుగులో కె.నందిని వెండి పతకం పొందారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement