● అన్ని శాఖలు సమర్థవంతంగా
పని చేస్తున్నాయి
● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ధాన్యం, మొక్క జొ న్న కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి సంతృప్తి వ్య క్తం చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో ఆ యా శాఖలు ధాన్యం, మొక్కజొన్న సేకరణలో సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం సమీక్షాసమావేశం నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గం మినహా, జిల్లాలోని మిగతా అ న్ని చోట్ల ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యా యని తెలిపారు. బాల్కొండ సెగ్మెంట్‌లో పంట కో తలు కొంత ఆలస్యమయ్యాయన్నారు. మరో మూ డు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించేందుకు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందన్నారు. అకాల వర్షాలు కురిస్తే రైతులు నష్టపోకుండా పెద్ద సంఖ్యలో హమాలీలను, వాహనాలను సమకూరుస్తూ, ప్రతి రోజూ సగటున 15 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరిస్తూ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ప్రభుత్వ గోదా ముల్లో స్థలం లేకపోవడంతో ప్రైవేట్ గిడ్డంగులను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. మొ క్కజొన్న సేకరణ సైతం తుది దశకు చేరిందన్నారు. పంట దిగు బడుల కొనుగోలు విషయంలో విమర్శలు చేస్తున్న వారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది గమనించి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. కలెక్టర్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు.


