నగరంలో న్యాయవాదుల నిరసన | - | Sakshi
Sakshi News home page

నగరంలో న్యాయవాదుల నిరసన

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

నిజామాబాద్‌ లీగల్‌: నగరంలోని జిల్లా కోర్టు ఎదుట గురువారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని హైకోర్టు జస్టిస్‌ రాజశేఖర్‌ రావు ఒక యువ న్యాయవాదిని జ్యుడీషియల్‌ కస్టడీకి ఇవ్వడం న్యాయవాదులకు అవమానకరమని అన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నీలకంఠరావు, సుభాష్‌రెడ్డి, సీనియర్‌ న్యా యవాదులు గణపతి, రాజేందర్‌ రెడ్డి, భాస్కర్‌, విఘ్నేష్‌, రాజు, నరేందర్‌ రెడ్డి, భాగీచరణ్‌, రవీందర్‌, అన్సారీ, జగన్మోహన్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement