రేషన్‌ దుకాణాల ద్వారా పసుపు పంపిణీకి కృషి | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దుకాణాల ద్వారా పసుపు పంపిణీకి కృషి

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

సీఎంతో మాట్లాడి సరఫరాకు చర్యలు

వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు

గడుగు గంగాధర్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రేషన్‌ దుకాణాల ద్వారా ప్రజలకు రాయితీపై పసుపు పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ స భ్యుడు గడుగు గంగాధర్‌ అన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్‌లో ఉన్న జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ (ఎఫ్‌పీవో)ను గడుగు శుక్రవారం సందర్శించి యంత్రాలను పరిశీలించారు. పసుపునకు నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలు దేశంలోనే పేరుగాంచా యని అన్నారు. పసుపు రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రయత్నం చే యడం లేదని, పసుపును కొనుగోలు చేయడం లేద ని విమర్శించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలి సి రేషన్‌ దుకాణాల ద్వారా రాయితీపై ప్రజలకు పసుపు అందించేందుకు తగినవిధంగా నివేదిక స మర్పిస్తానన్నారు. ఆయన వెంట జేఎంకేపీఎం ఎఫ్‌పీవో చైర్మన్‌ పాట్కూరి తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్‌, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ నిజామాబాద్‌ నగర అధ్యక్షుడు సుభాష్‌జాదవ్‌, మనోహరాబాద్‌ ఉప సర్పంచ్‌ అ ల్లూరి లింబారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌, ఉద్యాన శాఖ డివిజన్‌ అధికారులు రోహిత్‌, రాజుగౌడ్‌, ఏవో దేవిక, ఏఈవోలు శుభస్య, శివ, భాస్కర్‌, శ్రీకాంత్‌, పసుపు రైతులు పుప్పాల నాగేశ్‌, చిన్నయ్య, శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

పసుపు తయారీ, కొమ్ములను పరిశీలిస్తున్న వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌

Advertisement
 
Advertisement
Advertisement