నిజామాబాద్ రూరల్: అధిక జ్యేష్ఠమాసం కారణంగా శుభ ముహూర్తాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బాజాబజంత్రీలు మోగాలంటే నెలరోజులు ఆగాల్సిందేనని పండితు లు చెబుతున్నారు. ఈనెల 18 నుంచి జూన్ 18వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసం (మూఢం) కావడంతో ఎలాంటి ముమూర్తాలు లేవంటున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహుర్తాలు ప్రారంభవుతాయి. ఈనెల 13వ తేదీ పెళ్లి ముహూర్తాలకు చివరి రోజు కావడంతో జిల్లాలో దాదాపు 500కు పైగా వివాహలు జరిగాయి. జూన్ 18 వరకు గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాల ప్రారంభం వంటి శుభకార్యాలకు బ్రేక్ పడింది. పురోహితులు, కేటరింగ్, ఫొటోగ్రఫీ, ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ వారికి నెలరోజులపాటు ఉపాధి కరువు కానుంది.


