నిజామాబాద్ అర్బన్: ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 18న జిల్లాస్థాయిలో మాక్ ఎక్సర్‌సైజ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మాక్‌డ్రిల్ నిర్వహణకు నిర్ణీత ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
మాక్ డ్రిల్‌ను ఈ నెల 18న నిర్వహించాలని సూ చించారు. కాగా, మాక్‌ఎక్సర్‌ౖ సెజ్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. వీసీలో ఆర్డీవో రాజేంద్రకుమా ర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


