● మొక్కజొన్న కొనుగోళ్లు 88 శాతం పూర్తి
● వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం
రేవంత్ రెడ్డికి కలెక్టర్ ఇలా త్రిపాఠి
నివేదిక
నిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, మొక్కజొన్న కొనుగోళ్లు 88 శాతం పూర్తయ్యిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకొతెచ్చా రు. కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నామన్నా రు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు, వరి ధాన్యంపై ముఖ్యమంత్రి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్, జూపల్లి కష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు తదితర ఉన్నతాధికా రు లు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ప్ర భుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధా న్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాల ని ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను ఒప్పందం మేరకు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గోదాముల కొరత ఉన్న ప్రాంతాల్లో రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలన్నారు. అకాల వర్షాలకు ధా న్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా రైతులను ముందస్తుగానే అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియ మించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని, ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డీటీసీ దుర్గా ప్రమీల, ఎంవీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.


