ఉల్లాసంగా... ఉత్సాహంగా | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా... ఉత్సాహంగా

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

ప్రశంసలు

వేసవి శిబిరంలో విద్యార్థుల ఆటపాటలు

దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవికాల శిబిరంలో విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సందడి నెలకొన్నది. ఆటపాటలు, చిత్రలేఖనం, యోగా తదితర విద్యార్థి మనో వికాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 100 మంది విద్యార్థులు రోజూ వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు. యోగా, మెడిటేషన్‌, ఇండోర్‌ గేమ్స్‌, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు అల్పాహారం అందిస్తున్నారు. గజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు శరత్‌ కుమార్‌, చెలిమి కార్యక్రమ ఇంచార్జి ఎస్‌. వెంకటేశ్వర్లు, గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇంచార్జిగా నవీన్‌, ఆర్ట్స్‌ ఇంచార్జిగా నర్సింలు, యోగా మెడిటేషన్‌ ఇంచార్జిగా త్రివేణి, పాటలు సాంస్కృతిక కార్యక్రమాల ఇంచార్జిగా కమలాకాంత్‌ వ్యవరిస్తున్నారు.

మనోహరాబాద్‌లోని వ్యవసాయ కుండీలో స్నానం చేస్తున్న పిల్లలు

జక్రాన్‌పల్లి: భానుడి భగభగ మంటున్నాడు. ఎండలు తీవ్రత మరింత పెరిగింది. జనాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పిల్లలు వ్యవసాయ కుండీలలో స్నానాలు చేయడానికి పరుగులు పెడుతున్నారు. గ్రామాల్లోని రైతులు నీటి నిల్వ కోసం వ్యవసాయ పంట పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న కుండీల్లో జలకాలాడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

హాయ్‌ ఫ్రెండ్స్‌...నా పేరు మద్దికుంట చారుశ్రీ. టేక్రియాల్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న జిల్లా యో గా భవన్‌లో నిర్వహించిన కళలు–సాంస్కృతిక కార్యక్రమంలో జానపద నృత్యం ప్రదర్శించాను. నా నృత్య ప్రదర్శనను మెచ్చి డీఈవో సార్‌ ప్రథమ బహుమతి అందజేసి ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement