ఇందూరు చరిత్ర మ్యూజియంలోనే.. | - | Sakshi
Sakshi News home page

ఇందూరు చరిత్ర మ్యూజియంలోనే..

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

చరిత్రక నగరాల్లో ఇందూరు ప్రధానమైంది. వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవ జీవన ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా అతి పురాతనమైన జైన ఆలయాలూ నిర్మించబడ్డాయి. ఉన్నతమైన చరిత్ర కలిగిన జిల్లాలో ఉన్న పురావస్తు పరిశోధన శాఖ కార్యాలయం మూతబడడం, విశేష చారిత్రక ఆధారాలతో ఉన్న మ్యూజియం ప్రజలకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మ్యూజియాన్ని తెరిపించాలి.

– కలువకోట నరేశ్‌కుమార్‌, విశ్రాంత చరిత్ర విభాగాధిపతి, గిరిరాజ్‌ కళాశాల

మ్యూజియాన్ని తెరవాలి..

చరిత్ర మనకి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని జాతికి భవిష్యత్‌ ఉండదని ఎంతోమంది చరిత్రకారులు చెప్పారు. ఎంతో ప్రత్యేకమైన ఇందూరు జి ల్లా చరిత్ర ప్రస్తుత విద్యార్థులకు, యువతకు పరిచయం లేకుండా పోయింది. ఈ కారణంగానే ఇందూరు జిల్లా చారిత్రక పరంగా వెనుకబడిపోయింది. ఈ దుస్థితి నుంచి ఈ జిల్లాను బయటకు తీసుకురావాలి. మూసి ఉన్న మ్యూజియాన్ని తెరిపించాలి. – డాక్టర్‌ మర్రిపల్లి భూపతి, హిస్టరీ ప్రొఫెసర్‌

Advertisement
 
Advertisement
Advertisement