నిబంధనలు ఉల్లంఘిస్తే స్కానింగ్‌ సెంటర్లపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే స్కానింగ్‌ సెంటర్లపై చర్యలు

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రాజశ్రీ

సుభాష్‌నగర్‌: స్కానింగ్‌ సెంటర్లు నిబంధనలు ఉ ల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ బి రాజశ్రీ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లాస్థాయి సలహా సంఘం సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ ప్రతి స్కానింగ్‌ కేంద్రం రిజి స్ట్రేషన్‌ చేయించాలని, రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు, కార్డియాలజిస్ట్‌, ఆప్తమాలజిస్ట్‌ స్కానింగ్‌ చేసేందుకు అర్హులన్నారు. పీసీపీఎన్‌డీటీ చట్టం ద్వా రా నమోదైన వైద్యులు మాత్రమే స్కానింగ్‌ మిషన్లను వాడాలన్నారు. స్కానింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనుకునే వైద్యులు వైద్యాధికారి కార్యాల యం నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలన్నారు. స్కానింగ్‌ కేంద్రాల్లో వైద్యుల సమయపాలనను చార్ట్‌ ద్వారా ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని 131 స్కానింగ్‌ కేంద్రాలకుగాను మూడు నెలల్లో 96 కేంద్రాలను తనిఖీ చేశామని పేర్కొన్నారు. స్కానింగ్‌ కేంద్రాలను కేంద్ర తనిఖీ బృందాలు ముందస్తు సమాచారం లేకుండా తనిఖీ చేసే అధికారాన్ని కలి గి ఉంటాయన్నారు. ప్రతి స్కానింగ్‌కు డాక్టర్‌ సిఫారసు ధ్రువపత్రం తప్పకుండా అవసరమన్నారు. నాలుగు ఆస్పత్రులను స్కానింగ్‌ కేంద్రాలకు అను మతి కోసం కలెక్టర్‌ నివేదించామని తెలిపారు. కా ర్యక్రమంలో జీజీహెచ్‌ రేడి యాలజిస్ట్‌ డాక్టర్‌ నిశిత, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ నిషాత్‌, వైద్యులు శరత్‌చంద్ర, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సుప్రియ, డాక్టర్‌ శిఖర, డాక్టర్‌ శ్వేత, డాక్టర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

సలహా సంఘ సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి రాజశ్రీ

Advertisement
 
Advertisement
Advertisement