● అన్నదాతలకు సబ్సిడీపై సౌర విద్యుత్
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు
మోపాల్ : జిల్లాలోని రైతాంగానికి ఎన్‌పీడీసీఎల్ పె ద్దపీట వేస్తోందని, వివిధ కార్యక్రమాలతో మరింత చేరువ కావడంతోపాటు రైతు వారోత్సవాల్లో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) పీవీ రాజేశ్వర్‌రావు పేర్కొన్నా రు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన – ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం వ్యవసాయ క్షేత్రాలు – సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుమ్) అనే అంశంపై మోపాల్ రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్‌పీడీసీఎల్ అందిస్తున్న గృహజ్యోతి, పొలంబాట/ప్రజాబాట, విద్యు త్ భద్రతల గురించి దృశ్య రూపకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. పీవీ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, రైతులకు ఆర్థికభారం తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక శ క్తి జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సౌర, ప వన, జల, భూఉష్ణ, బయోమాస్, గ్రీన్ హైడ్రోజన్ ప్ర గతిలో తెలంగాణ సత్తా చాటాలని లక్ష్యమన్నారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్ టాప్‌ను ప్రోత్సహిస్తున్నామని ఎస్‌ఈ తెలిపారు. పీ ఎం కుసుమ్–ఏ పథకం కింద రైతులు తమ వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు వి క్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. పీఎం కుసుమ్–సీ పథకం కింద 7.5 కి లోవాట్ల సోలార్ ద్వారా నడిచే పంపు సెట్‌ను లైవ్ డెమో ద్వారా రైతులకు వివరించారు. ఈ పంపుసె ట్ వల్ల వాడనప్పుడు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రైతులు రాయితీలతో కూడి న సోలార్ పథకాలను సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు.
విద్యుత్ భద్రత వారోత్సవాలు విజయవంతం..
జిల్లాలో మే 1 నుంచి 7 వరకు వారం రోజులపాటు సర్కిల్ పరిధిలో నిర్వహించిన విద్యుత్ భద్రత వా రోత్సవాలు విజయవంతమైనట్లు ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జీరోస్థా యికి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. వి ద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలస త్వం కారణంగా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నా యని, స్వీయ నియంత్రణ ముఖ్యమని పేర్కొన్నా రు. నిర్లక్ష్యంగా విద్యుత్ పరికరాల వినియోగం, పాడైన నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎ ర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టుకోవడంతో ప్రమాదాలు జరుగుతాయ ని చెప్పారు. కార్యక్రమంలో డీఈ హరిచంద్ నాయ క్, ఏడీఈ బాలేష్‌కుమార్, ఇన్‌చార్జి ఏవో హీరా జా దవ్, సర్పంచ్ ద్యాప రవికుమార్, ఏఈవోలు శరత్, రంజిత్, భావన, ఎన్‌పీడీసీఎల్ ఏఈలు, లైన్ ఇన్ స్పెక్టర్లు, లైన్‌మెన్లు, రైతులు పాల్గొన్నారు.


