● సమాజంలో గురువులకు గొప్పస్థానం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
● ఘనంగా విద్యా విజయోత్సవం
సుభాష్‌నగర్: విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్ త రాలను తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు సమ ర్థవంతంగా నిర్వర్తించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకు ని ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్యా విజయోత్సవ దినోత్సవాన్ని నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్ ఇలా త్రిపాఠితోపాటు రా ష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాశాఖ ప్రగతిని డీఈవో అశోక్ వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చక్కటి భవిష్యత్‌ను అందించాల్సిన బాధ్యత గురువులదేనని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం, గొప్ప స్థానం ఉందన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయన్నారు. జిల్లాలో ప్రభు త్వ బడుల విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమన్నారు. భవిష్యత్‌లో స్థిరపడేందుకు పదోతరగతి తర్వాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకమని, ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సుల్లో చేరాలన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, కృష్ణవేణి, డీపీఆర్‌వో ఎన్ పద్మశ్రీ, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, జీఈసీవో భాగ్యలక్ష్మి, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


