పనులను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పనులను వేగవంతం చేయాలి

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

రుద్రూర్‌: యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని బోధన్‌ ఆర్డీవో విజయకుమారి సిబ్బందిని ఆదేశించారు. పోతంగల్‌ మండలం పీఎస్‌ఆర్‌ నగర్‌ (రాంగంగా నగర్‌) శివారులో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన పనులను గురువారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ సమయంలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోటగిరి ఏఎంసీ చైర్మన్‌ గైక్వాడ్‌ హన్మంతు, తహసీల్దార్లు విష్ణు, గంగాధర్‌, రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement