ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన

తెయూ(డిచ్‌పల్లి): దోస్త్‌ ద్వారా డిగ్రీ కళాశాలల మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించారు. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ విభాగాలలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువపత్రాలను తెయూ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ కార్యాలయంలో అడ్మిషన్స్‌ డైరెక్టర్‌, దోస్త్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌ నేతృత్వంలో సంబంధిత అధికారులు పరిశీలించారు. వర్సిటీ పరిధిలో ఎన్‌సీసీ కేటగిరీలో 20 మంది, స్పోర్ట్స్‌ కేటగిరీలో 14 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్‌ రామస్వామి, తెయూ ఫిజికల్‌ డైరెక్టర్‌ బీఆర్‌ నేతతోపాటు సిబ్బంది నరేశ్‌, రవీందర్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement