న్యూస్‌రీల్
మంచి మామిడిని..
బండ్ల మీద పసుపు రంగు మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. కానీ మంచి మామిడిని గుర్తించాల్సిన అవసరం ఉంది.
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026
– 8లో u
జిల్లా కేంద్రంలోని మ్యూజియం భవనం
ధ్వంసమైన కాకతీయుల కులౖదైవ విగ్రహం
ఇందూరు చరిత్రకు మూలాధారం
జైనతీర్థంకరుల విగ్రహం
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన
కాకతీయ కళాతోరణం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మనదైన ఘన చరిత్రను ప్రజలకు, భవిష్యత్ తరాలకు ప్రత్యక్షంగా పరిచయం చేయాల్సిన జిల్లా కేంద్రంలోని మ్యూజియానికి తాళం పడింది. సుమారు పది సంవత్సరాలకుపైగా కాల నుంచి మ్యూజియం ఆదరణకు నోచుకోవడం లేదు. కనీసం సందర్శనకు కూడా అవకాశం లేకుండా మూసి ఉంటోంది. దేశంలోనే ఇందూరుకు సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉండగా, జిల్లా కేంద్రంలోని పురావస్తు పరిశోధన శాఖ మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు పరిశోధన శాఖలో ఉద్యోగులు లేకపోవడం, మ్యూజియం నిర్వహణకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో చివరకు తాళం పడింది. ఎంతో అమూల్యమైన శిల్ప సంపద, చారిత్రక ఆధారాలు ధ్వంసమవుతున్నాయి. అలాగే బోధన్ నగరానికి సుమారు 2వేల సంవత్సరాలకు పైగా చారిత్రక నేపథ్యం ఉండగా, ఎన్నో పుస్తకాల్లో ఆధారాలు సైతం ఉన్నాయి. ఆయా ఆధారాల్లో ముఖ్యమైన జైన తీర్థంకరుడి విగ్రహం మ్యూజియం బయట నిర్లక్ష్యంగా పెట్టబడి ఉన్నది. మ్యూజియం వెనకాల ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకతాయిల చేతిలో ధ్వంసమవుతున్నాయి. అదే విధంగా జిల్లాలోని ఎన్నో చారిత్రక ప్రదేశాల్లో పలు తవ్వకాలలో లభించిన అతి పురాతన విగ్రహాలు, పనిముట్లు, చారిత్రక ఆధారాలు మ్యూజియంలో లోపల ఉన్నాయి. కానీ వాటి సందర్శన భాగ్యం ప్రజలకు కలగకపోవడం బాధాకరమని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర తెలుసుకోని జాతికి భవిష్యత్ ఉండదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను అనుసరించి కనీసం ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపి మ్యూజియం తెరిపించాలని, పురావస్తు పరిశోధన శాఖలో రెగ్యులర్ ఉద్యోగులను నియమించి చరిత్రకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రజలు, చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు.
చరిత్రను తెలియజెప్పాల్సిన మ్యూజియం మూతపడింది. ఇందూరు ఘన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియకుండా పోతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న మ్యూజియం మూతపడినా పట్టించుకునే వారు కరువయ్యారు. ఆరుబయట ఉన్న విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో దశాబ్దకాలంగా మ్యూజియానికి వేసిన తాళం అలాగే ఉంది.


