గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కూలిపోవడం చూస్తుంటే బాధగా, భయంగా ఉంది

Omar Abdullah Described Azads Resignation From Congress As Body Blow - Sakshi

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ కాం‍గ్రెస్‌ పార్టీ సభ్యుత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా భారత్‌లోని ఒక ప్రముఖ గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కూలిపోడం చూస్తుంటే బాధగానూ, భయంగానూ ఉందని ఆవేదనగా అన్నారు.

గులామ్‌ నబీ ఆజాద్ కాంగ్రెస్‌కి రాజీనామా చేయడం పార్టీకి అతి పెద్ద శరాఘాతంగా ఆయన అభివర్ణించారు. గత కొంతకాలంగా ఆజాద్‌ రాజీనామ చేస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఇలాంటి రాజీనామాలు కాంగ్రెస్‌కి కొత్తేం కాదు. కానీ కాంగ్రెస్‌ పార్టీలోని అతి సీనియర్‌ నాయకుడైన గులామ్‌ నబీ ఆజాద్‌ రాజీనామ చేయడం మాత్రం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. అంతేకాదు పార్టీ నుంచి వైదొలగిన అత్యంత సీనియర్‌ నాయకుడు గులామ్‌  నబీ అజాద్‌ రాజీనామా లేఖ చదవడం చాలా బాధకరం అని ఆయన ట్వీట్‌ చేశారు. 

(చదవండి: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. పార్టీకి ఆజాద్‌ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top