sad
-
పంజాబ్‌లో బీజేపీ ఒంటరి పోరు: సునీల్ జాఖర్
పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాఖర్ తెలిపారు. 400 లోక్‌సభ స్థానాల లక్ష్యంతో వివిధ పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతున్న బీజేపీ పంజాబ్ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకుంది. తప్పకుండా దేశంలో 400 స్థానాల్లో గెలుస్తామని, ఇప్పటికే ప్రధాని మోదీ తన ధీమాను వ్యక్తం చేసారు. పంజాబ్‌లోని 13 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. 2019లో బీజేపీ ఎస్ఏడీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన 5 స్థానాలను బీజేపీ, ఎస్ఏడీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సొంతం చేసుకున్నాయి. కాగా 2020లో ఎస్ఏడీ.. బీజేపీ సంబంధాలు తెగిపోయాయి. భవిష్యత్తులో కూడా ఈ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని జాఖర్ స్పష్టం చేశారు. BJP to contest the Lok Sabha elections alone in Punjab. ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਲੋਕ ਸਭਾ ਚੋਣਾਂ ਪੰਜਾਬ ਵਿਚ ਇੱਕਲੇ ਲੜਨ ਜਾ ਰਹੀ ਹੈ। pic.twitter.com/FbzfaePNj3 — Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) March 26, 2024 -
ఆ సుఖం...నిజమైన సుఖం కాదు!
అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది... ‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు. ‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్‌లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు. ‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!! -
గవర్నర్ తీరు బాధాకరం: కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పంపించిన ఎమ్మెల్సీల ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందని అన్నారు. బడుగు బలహీనర్గాలకు చెందిన వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే ఆపటం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తోందని అన్నారు. #WATCH | BRS MLC K Kavitha says, "Rejecting the 2 names proposed by BRS for the MLC seats is nothing but a clear violation of the federal spirit of the nation. This nation is a federal nation and it works on federal traditions that were established a long time back and that kind… pic.twitter.com/GrwjdeX42J — ANI (@ANI) September 26, 2023 చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో నివాళులు అర్పించిన కవిత అనంతరం మాట్లాడుతూ.. 'గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజ్యాంగ బద్దంగా పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు సరికాదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం దేశంలో అమలు అవుతుంది.' అని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండ ప్రకాశ్.. తెలంగాణ ఉద్యమం లో ఆమె పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అందుకే తెలంగాణ వచ్చాక ఆమె పేరును స్మరిస్తూ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై -
బతుకు పండుగ
లోకంలో దుఃఖం మాత్రమే ఉందా? లేదు, సంతోషం కూడా ఉంది. శత్రుత్వపు చేదు మాత్రమే ఉందా? లేదు, ఆపదలో ఆదుకునే స్నేహమాధుర్యమూ ఉంది. సమరమే కాదు, శాంతీ; సంఘర్షణే కాదు, సామరస్యమూ; భయబీభత్సాలే కాదు; కరుణారౌద్రాలూ ఉన్నాయి. ఒక్కోసారి ప్రళయ తాండవంతో భయపెట్టే ప్రకృతిలోనే, సేదదీర్చే అందాలూ, ఆహ్లాదాలూ ఉన్నాయి. కానీ ఎంత సేపూ పెద్ద పెద్ద కష్టాలనే ఊహించుకుంటూ చిన్న చిన్న సంతోషాలను విస్మరిస్తాం. జీవితాన్ని ముళ్ళకంపగా భావించుకుంటూ పక్కనే ఉన్న మల్లెపొదల గుబాళింపును గమనించలేకపోతాం. జీవించడం కోసం చేసే ప్రయత్నంలో మనసారా జీవించడాన్ని మరచిపోతాం. మన పక్కనే ఉన్న మంచినీ, మానవత్వాన్నీ గుర్తించడంలో ఎలా విఫలమవుతామో ఒక చక్కని కథలో రావిశాస్త్రి చిత్రిస్తాడు. ఆ కథలో ఇద్దరు మిత్రులుంటారు. ఒకతను ఎప్పుడూ ఏదో కష్టంలో చిక్కుకుని కుంగిపోతూ ఉంటాడు; నిరాశానిస్పృహలకు ప్రతిరూపంగా మారి జీవితంపై విరక్తుడ వుతుంటాడు. రెండో వ్యక్తి ప్రతిసారీ అతనికి చేయందించి సమస్య నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. అలా అతను తేరుకున్న ఓ రోజున తన ఖర్చుతో సినిమాకు తీసుకెడతాడు. ఆ సినిమాలోని ప్రతి నాయకుడు నాయికానాయకులను పెడుతున్న ముప్పుతిప్పలు చూసి, లోకంలో ఎక్కడా మంచి తనం, మానవత్వమే లేవంటూ అతను భారంగా నిట్టూర్చుతాడు. పక్కనే ఉన్న మిత్రుడు అతని వైపు ఒకసారి వింతగా చూసి మనసులోనే నవ్వుకుంటాడు. ఇప్పుడు కొంత మారి ఉండచ్చు కానీ, నిన్నమొన్నటివరకు పెళ్లి అనగానే కట్నాలు, కయ్యాలు, అలకలు, మాటపట్టింపులు, మనస్పర్థలే గుర్తుకొచ్చేవి. గుండె బరువెక్కించే ఇలాంటి అలవాటు పడిన చిత్రణకు భిన్నంగా అడుగడుగునా ఆహ్లాదం నింపేలా ఎవరైనా పెళ్లి కథను నడిపిస్తే అది మండువేసవిలో హఠాత్తుగా వీచిన మలయానిలంలా అలరిస్తుంది. ‘వసుంధర’ రాసిన ‘పెళ్ళిచేసి చూడు’ అనే నవల అలాంటి ఓ అరుదైన ఆశ్చర్యం. అందులో ముగ్గురు అన్నదమ్ములు, వారి భార్యలు ఆడబడచు పెళ్లిని తలకెత్తుకుంటారు. అన్ని విషయాలూ కలసి చర్చించుకుంటారు, సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు, సమానంగా బరువు బాధ్యతలు పంచుకుంటారు, సంఘ టితంగా అడుగులు వేస్తారు. మగపెళ్ళివారి నుంచి సాధారణంగా ఎదురయ్యే సమస్యలే వస్తాయి. జయప్రదంగా పెళ్లి చేయడం ఒక్కటే లక్ష్యంగా వాటిని తెలివిగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఎలాంటి క్లిష్టపరిస్థితిలోనూ ఆందోళనకు లోనుకారు; ఒకరిపై ఒకరు లోక్తులు విసురుకుంటూ, ఒకరి నొకరు ఆటపట్టించుకుంటూ పరిసరాలను సంతోషభరితం చేసుకుంటారు. కల్యాణాన్నే కాదు, కల్యాణం చేయించిన తీరునూ కమనీయం చేస్తారు. ఈ ‘పెళ్ళిచేసిచూడు’ నమూనా పెళ్లికే కాదు; తమలో తమకున్న అన్ని విభేదాలనూ పక్కన పెట్టి పదిమందీ ఉమ్మడిగా నిర్వర్తించాల్సిన ఏ బాధ్యతకైనా వర్తిస్తుంది. ఉదాహరణకు, దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమన్న ఉమ్మడి లక్ష్యం దిశగా విజయవంతంగా నడిపించడంలో అధికారపక్షానికీ, ప్రతిపక్షాలకూ కూడా చక్కని ఒరవడి అవుతుంది. గొప్ప తాత్విక గాంభీర్యమూ, బహిరంతర్ఘర్షణా, జీవితం గురించిన చిక్కు ప్రశ్నలూ, ఒడుదొ డుకులూ ఉన్న రచనల్లోనూ, బరువైన పాత్రల సరసనే, వాతావరణాన్ని తేలిక చేసి ఉల్లాసపరిచే పాత్రలూ కనిపిస్తూ ఉంటాయి. అవి జీవితం తాలూకు అన్ని పార్శ్వాలనూ స్పృశించే రచయిత దృష్టివైశాల్యాన్ని పట్టి చూపుతాయి. బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలలోని జగన్నాథం అలాంటి పాత్ర. సమస్యలకు అతీతంగా, దేనిమీదా ఎలాంటి ఫిర్యాదూ లేకుండా, సరదాగా, స్నేహంగా, హాస్యంగా ప్రవర్తించే జగన్నాథం చిన్నపాత్రే అయినా నాయకుడు దయానిధితో సమా నంగా గుర్తుండిపోతాడు. గమనించే చూపే ఉండాలి కానీ, అలాంటి వ్యక్తులు మన నిజజీవితంలోనూ మన చుట్టుపక్కల తారసపడుతూనే ఉంటారు. తను రచయితా, గొప్ప చదువరీ కాక పోయినా ప్రతి సాహిత్యసమావేశంలోనూ, రచయితల గోష్ఠుల్లోనూ విలక్షణమైన వాక్చాతుర్యంతో తన ఉనికిని ప్రముఖంగా చాటుకునే సంకు పాపారావు అనే రావిశాస్త్రి మిత్రుని గురించి వైజాగ్ లోనూ, బయటా కూడా సాహితీ ప్రముఖులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. తమ ఉజ్జ్వల వ్యక్తిత్వంతో శత్రుమిత్రుల తేడా లేకుండా అందరి మధ్యా సమానంగా తళుకులీనే పాత్రలూ ఆ యా విశిష్ట రచనల్లో కనిపిస్తాయి. అమెరికా అంతర్యుద్ధం నేపథ్యంగా మార్గరెట్ మిచెల్ రచించిన ‘గాన్ విత్ ద విండ్’ నవలలోని మెలనీ పాత్ర అలాంటిది. చాలా అర్భకంగా, అమాయకంగా ఉండే మెలనీ, ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని తన ఉదాత్త వ్యక్తిత్వంతో ఆ నవలలోని ఇతర ప్రధాన స్త్రీ, పురుషపాత్రలను మించి ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుంది. అభద్రత, అల్లకల్లోలం, ఉద్రిక్తత, స్థానభ్రంశం, లేమి నిండిన ఆ యుద్ధ వాతావరణం వజ్రం లాంటి ఆమె వ్యక్తిత్వానికి మరింత సానపట్టి కొత్త కాంతుల్ని ఆవిష్కరింపజేస్తుంది. యుద్ధం వరకే శత్రుత్వమని చెప్పి స్వపక్షంతో ఒంటరి పోరాటం చేసి, శత్రు సైనికుల సమాధుల వద్ద కూడా మెలనీ పుష్ప గుచ్ఛాలు ఉంచి వస్తుంది. ఇలాంటి పాత్రలూ, వ్యక్తులూ ప్రపంచాన్ని మరింత ఆశావహంగానూ, వాసయోగ్యం గానూ రూపిస్తారు. బతుక్కి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని సంతరిస్తారు. ప్రేమనూ, స్నేహాన్నీ ఇచ్చి పుచ్చుకుని జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోడానికి స్ఫూర్తినిస్తారు. మిట్టపల్లాల చీకటిదారిలో దీపస్తంభాలవుతారు. -
Indira Devi Death: తల్లి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు
తల్లి ఇందిరా దేవి(70) మృతితో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఏడాది జనవరిలోనే సోదరుడు రమేశ్ బాబు మరణించడం, ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. మహేశ్‌కు తల్లి ఇందిరా దేవిపై అపురూపమైన ప్రేమ. పలు సందర్భల్లో ఆమె ప్రస్తావన రాగానే ఎంతో ఎమోషనల్ అయ్యాడు. పెళ్లికిముందు వరకు ఆయన తల్లి చాటునే పెరిగాడు. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఓ వివాహ వేడుకకు ఇందిర వచ్చినప్పుడు మహేశ్‌బాబు ఆమెను రిసీవ్ చేసుకున్న విధానం అందరినీ ఆకర్షించింది. తండ్రికి రెండో వివాహం.. అందుకే తల్లి చాటున ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణ మామ కూతురే. వరసకు మరదలు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లకే కుటుంబసభ్యుల సలహా మేరకు ఇందిరను పెళ్లి చేసుకున్నారు కృష్ణ. అయితే ఆ తర్వాత విజయ నిర్మలతో వరుసగా సినిమాలు తీయడంతో ఆమెతో ప్రేమలో పడ్డారు. దీంతో ఇందిరతో పెళ్లైన నాలుగేళ్లకే.. విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ. పెళ్లి విషయాన్ని ఇందిరకు చెప్పారు. ఆ తర్వాత కూడా అందరూ కలిసే ఉన్నారు. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఇందిరా దేవి ఎప్పుడూ బయటకు రాలేదు. ఫంక్షన్లలోనూ అరుదుగా కనిపించారు. ఎమోషనల్ పోస్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 20న ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు చాలా ప్రత్యేకంగా ట్విట్టర్లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. అమ్మా మీరు నా తల్లికావడం అదృష్టం. మీ గురించి చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ట్వీట్ చేశాడు. మహేశ్ తన మాతృమూర్తి పట్ల చూపించిన ప్రేమను చూసి ఆయన అభిమానులు మురిసిపోయారు. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె ప్రాణాలు కోల్పోవడం మహేశ్‌తో పాటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Happy birthday Amma ♥️ Thank you for being the blessing you are. One day is never truly enough! Love you always 🤗🤗🤗 pic.twitter.com/92aqNPmUQR — Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2022 చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం -
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కూలిపోవడం చూస్తుంటే బాధగా, భయంగా ఉంది
శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ సభ్యుత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా భారత్‌లోని ఒక ప్రముఖ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కూలిపోడం చూస్తుంటే బాధగానూ, భయంగానూ ఉందని ఆవేదనగా అన్నారు. గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్‌కి రాజీనామా చేయడం పార్టీకి అతి పెద్ద శరాఘాతంగా ఆయన అభివర్ణించారు. గత కొంతకాలంగా ఆజాద్ రాజీనామ చేస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఇలాంటి రాజీనామాలు కాంగ్రెస్‌కి కొత్తేం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలోని అతి సీనియర్ నాయకుడైన గులామ్ నబీ ఆజాద్ రాజీనామ చేయడం మాత్రం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. అంతేకాదు పార్టీ నుంచి వైదొలగిన అత్యంత సీనియర్ నాయకుడు గులామ్ నబీ అజాద్ రాజీనామా లేఖ చదవడం చాలా బాధకరం అని ఆయన ట్వీట్ చేశారు. Long rumoured to be in the offing but a body blow to the Congress none the less. Perhaps the senior most leader to quit the party in recent times, his resignation letter makes for very painful reading. It’s sad, and quite scary, to see the grand old party of India implode. https://t.co/Z6gj9AophE — Omar Abdullah (@OmarAbdullah) August 26, 2022 (చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్) -
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంట్లో విషాదం
సాక్షి, వికారాబాద్(రంగారెడ్డి) : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తల్లి, స్వర్గీయ జస్టిస్ కొండా మాధవరెడ్డి సతీమణి జయలతాదేవి (91) శనివారం ఉదయం కన్నుమూశారు. విశ్వేశ్వర్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళవారం. మాధవరెడ్డి దంపతులకు కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాతృమూర్తి మృతి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. విశ్వేశ్వర్‌రెడ్డిని ఫోన్లో పరామర్శించి సంతాపం తెలిపారు. సినీ హీరో చిరంజీవి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. కొండా నివాసానికి చేరుకుని జయలతాదేవి పార్థీవదేహానికి నివాళర్పించారు. రేపు(సోమవారం) మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు -
భక్తి
కాశీ క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు రామయ్య. దారిలో అతనికి సోమయ్య అనే బాటసారి కలిశాడు. ఇద్దరూ కొద్ది సమయంలోనే స్నేహితులై కలసి ప్రయాణం చేయసాగారు. అలా కొంతదూరం వెళ్ళేసరికి దారిలో రామయ్యకు బంగారునాణెం దొరికింది.‘‘పాపం. ఎవరో దురదృష్టవంతులు. జాగ్రత్తచేయి. తిరుగుప్రయాణంలో ఇచ్చేద్దాం’’ అన్నాడు సోమయ్య.‘‘వాడు ఎవడో పోగొట్టుకున్నాడు. వాడు దురదృష్టవంతుడు. నాకు దొరికింది. నేను అదృష్టవంతుడను. ఇద్దరం ఒకే రహదారిపై నడుస్తున్నాం. ఇది నాకే ఎందుకు దొరకాలి.? నీకు ఎందుకు దొరకకూడదు? ఎందుకంటే నేను అదృష్టవంతుడను కాబట్టి.నాకు దక్కిన అదృష్టాన్ని నేనెందుకు వదులుకుంటాను? వదులుకోను. లక్ష్మీదేవి తలుపు కొట్టినప్పుడే తియ్యాలట. అలా ఈ బంగారునాణెం నన్ను వరించింది.’’ అన్నాడు గర్వంగా. ఏమీ మాట్లాడలేదు సోమయ్య. కొద్దిరోజులకు కాశీనగరం ప్రవేశించారు. అలా ప్రవేశించిన కాసేపటికే బంగారునాణెం ఉన్న రామయ్య మూటను ఎవరో దొంగిలించారు. కట్టుగుడ్డలతో మిగిలాడు రామయ్య.‘‘ఎవరో ఆ మూట దొరికిన అదృష్టవంతులు’’ అన్నాడు సోమయ్య.ఆ మాటలకి కోపం వచ్చిన రామయ్య ‘‘వేళాకోళం చేస్తున్నావా?’’ అన్నాడు సోమయ్యను చూస్తూ. ‘‘కాదు. నువ్వన్నదే నీకు చెబుతున్నాను. దొరికినవాళ్ళు అదృష్టవంతులు అన్నావు. బంగారునాణెం దొరికి నువ్వు అదృష్టవంతుడవు అయితే.. ఆ నాణెంతో సహా నీ మూట దొరికినవాడూ అదృష్టవంతుడే కదా!’’ అన్నాడు అతి మామూలుగా. ‘‘ఒక స్నేహితునిగా నాబాధ నీబాధ కాదా? పైగా వేళాకోళం చేస్తున్నావు..’’ అన్నాడు రామయ్య.‘‘స్నేహితుణ్ణి కాబట్టే నీ మేలుకోరి.. బంగారునాణెం దొరికినప్పుడు జాగ్రత్తచేయి తిరుగుప్రయాణంలో ఇచ్చేద్దాం అన్నాను. అది నీ అదృష్టంగా భావించి ఇవ్వనన్నావు. మనదికాని వస్తువు మన దగ్గర నిలవదు. అది వెళుతూ వెళుతూ మనది కూడా పట్టుకుపోతుంది. నువ్వే నిజమైన భక్తుడివైతే తిరుగుప్రయాణంలో ఆ వ్యక్తి ఎవరో.. ఆతను పోగొట్టుకున్న బంగారునాణెం అతనికి తిరిగి ఇచ్చి అతణ్ణి మరింత అదృష్టవంతుణ్ణి చేసేవాడివి. ఎందుకంటే వస్తువు దొరికినవాడు అదృష్టవంతుడైతే, పోగొట్టుకున్న వస్తువును తిరిగిపొందిన వాడిది మరింత అదృష్టం. కానీ నువ్వు అసలైన భక్తుడివి కావు. అందుకే ఆ నాణెం ఉంచేసుకున్నావు. అది మొత్తాన్నే పట్టుకుపోయింది.‘‘నిజమేసుమా..! పరాయి సొమ్ము ఆశించటం నిజమైనభక్తుల లక్షణం కాదు. ఒకవేళ పోయిన నా మూట నాకు దొరికితే గనుక ఆ బంగారు నాణేన్ని అతనికి తిరిగి ఇచ్చేస్తాను..’’ అన్నాడు పశ్చాత్తాపంతో.. ఇంతలో వెనకనుండి..‘ ఎవరో వృద్ధుడు...‘‘అయ్యా..! ఈ మూట తమరిదే కదా? ఇందాక మీరు దీనిని గట్టుమీద పెట్టి గంగలో స్నానానికి దిగినప్పుడు దొంగ దీనిని తస్కరించటం చూసి వెంటాడి తరిమిపట్టుకున్నాను. ఇందాకట్నించీ మీకోసం వెదుకుతున్నాను.. ఇప్పుడు కనపడ్డారు.. తీసుకోండి’’ అన్నాడు.‘ఇన్నివేలమందిలో పోయిన వస్తువు దొరకటం చిన్నవిషయం ఏమీకాదు. ఇదే నిజమైన అదృష్టం..’’ అంటూ ఆ వృద్ధునికి నమస్కరించాడు. అతను వెళ్ళిపోయాకా..మూటలోని బంగారునాణెం బయటికి తీసి చూస్తూ..‘‘మాటల్లో మీరూ, చేతల్లో ఆ వృద్ధుడు నా కళ్ళు తెరిపించారు. దీనిని తిరుగు ప్రయాణంలో ఆ పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇచ్చి అతణ్ణి నా అంత అదృష్టవంతుణ్ణి చేస్తాను..’’ అన్నాడు పశ్చాత్తాపపడుతూ..‘‘అదే అసలైన భక్తి..’’ అన్నాడు సోమయ్య. కన్నెగంటి అనసూయ -
ఆశీర్వచన బలం
పూర్వం మృకండుడు, మరుద్వతి అనే ముని దంపతులుండేవారు. వారికి సంతానం లేకపోవడంతో మృకండుడు శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘‘నీకు పదహారేళ్ళ వయసు వరకు జీవించే కుమారుడు జన్మిస్తాడు’’ అని వరమిచ్చాడు. ఆ కుమారుడికి మార్కండేయుడని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు ఆ దంపతులు. ఆ దంపతులు తమ కుమారునికి బాల్యం నుంచి పెద్దలందరికీ పాదనమస్కారాలు చేయడం అలవాటు చేశారు. మార్కండేయుడు అలా నమస్కరించిన ప్రతిసారీ, అతన్ని ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ అని దీవించేవారు. చూస్తుండగానే మార్కండేయునికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. మరికొది ్దరోజులలో తమ కుమారుడి ఆయుర్దాయం తీరిపోతోందని తెలిసి మృకండ దంపతులు తమలో తామే కుమిలిపోసాగారు. తల్లిదండ్రుల వద్ద విషయం తెలుసుకున్న మార్కండేయుడు ‘‘నన్ను ఆశీర్వదించండి. శివుని గూర్చి తపస్సు చేస్తాను. ఆ బోళాశంకరుడు నన్ను కరుణించబోడు. మీరు బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి హిమాలయాలకు వెళ్లి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి చిన్న దేవాలయం నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు. ఆ బాలుడి ఆయువు తీరే సమయం అసన్నం కావడంతో యమదూతలు వెళ్లారు. అయితే, మార్కండేయుని మెడలో పాశం వెయ్యడానికి భయం వేసి వెనుతిరిగి వెళ్ళిపోయారు. అపుడు యముడు తానే స్వయంగా వెళ్లి, ‘ఓ బాలకా! బయటకు రా! నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను’ అన్నాడు. మార్కండేయుడు భయంతో శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. యముడు పాశాన్ని మార్కండేయుడి మెడలోకి విసిరి బలంగా లాగాడు. పాశం శివలింగానికి తగిలింది. అంతే! శివలింగం ఫెటిల్లున పేలిపోయి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమ కాలితో యమధర్మరాజు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికి యముడు విరుచుకు పడిపోయాడు. శివుడు మార్కండేయునితో ‘‘నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో’’ అన్నాడు. మార్కండేయుడు ‘‘స్వామీ! పాపం! యముడు భయకంపితుడై ఉన్నాడు. ఆయనను కరుణించండి’’ అన్నాడు. శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు లేచి నమస్కరించి ‘‘స్వామీ, నువ్వు ఈ బాలుడికి పదహారు సంవత్సరాలు ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి ‘‘ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అని అర్థం చేసుకోవడమే నీ దోషం. అందుకని ఇలా జరిగింది. ఏమీ బెంగలేదు. వెళ్ళు’’ అన్నాడు.‘‘నాయనా! మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను. చిరంజీవివై ఉండు’’ అని ఆశీర్వదించాడు.పెద్దల ఆశీర్వచనం, భగవంతునిపట్ల నిర్మల భక్తి ఎప్పటికీ వృథాపోవన్నది ఇక్కడ తెలుసుకోవలసిన నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆత్మార్పణే ముక్తిపథం
లోకంలో కనిపించే చెడు అంతా, దురవస్థ అంతా అజ్ఞానప్రభావమే. మానవుడు జ్ఞానిగానూ, విశుద్ధుడుగానూ ఆత్మ బలాఢ్యుడుగానూ, విద్యా వంతుడుగానూ అయిన తరువాతే లోకంలోని దుఃఖం ఉపశమిస్తుంది. అంతేకానీ, ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందే వరకు దుఃఖం అతడిని వెన్నంటే ఉంటుంది. ఒక బొమ్మను దేవుడని మనం పూజించవచ్చు. కానీ, దేవుణ్ణి బొమ్మగా భావించరాదు. ప్రతిమలో భగవంతుడున్నాడని తలచడం తప్పుకాదు. భగవంతుడే ప్రతిమ అనుకోరాదు. దానాన్ని మించిన దొడ్డగుణం మరేదీ లేదు. దేనినైనా ఇతరులకు ఇవ్వడానికి చేయి చాపేవాడు మనుష్యుల్లో మహోత్కృష్టస్థానాన్ని అలంకరిస్తారు. ఎల్లప్పుడూ ఇతరులకు ఇవ్వడం కోసమే చేయి రూపొందించబడింది. మీరు ఆకలితో బాధపడుతున్నా, మీ వద్ద ఉన్న ఆఖరి కబళం వరకూ పరులకు ఇచ్చి వేయండి. ఇతరులకు ఇచ్చేసి మీరు క్షుద్బాధ వల్ల ఆత్మార్పణ చేసుకుంటే, క్షణంలో ముక్తి మీకు ముంచేతి కంకణమవుతుంది. ఇలా చేసిన మంగళ ముహూర్తంలో మీకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. -
మీరు ఎందుకు తెలివిగా ప్రవర్తించడం లేదు..?
-
వీరజవాన్ల కుటుంబంలో విషాదఛాయలు
-
విహారయాత్రలో విషాదం
ఏకేబీఆర్ మెయిన్ కెనాల్లో పడి వ్యక్తి మృతి – పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఘటన పెద్దఅడిశర్లపల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తన బంధువులతో కలిసి ఆదివారం ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు) విహారయాత్రకు వచ్చిన వ్యక్తి మెయిన్ కెనాల్లో పడి తినిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన మహమ్మద్ ఖలీల్‌ఖాన్ (41) స్థానికంగా ఉంటూ వ్యాపారం నిర్వహించేవాడు. మహమ్మద్ ఖలీల్‌ఖాన్ తన సోదరులతో కలిసి సెలవు దినం కావడంతో పీఏపల్లి మండలంలోని ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు) విహారయాత్రకు వచ్చారు. ఖలీల్‌ఖాన్ తన సోదరులతో కలిసి భోజనం చేసి స్నానం చేయడానికి ఏఎమ్మార్పీ మెయిన్ కాల్వలోకి దిగాడు. కాగా ఖలీల్‌ఖాన్ నీటిలో ఈత కొడుతూ అలిపిరి వచ్చి ఊపిరాడక మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి బయటకు తీయగా అప్పటికే ఖలీల్‌ఖాన్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకుని గుడిపల్లి ఎస్ఐ భోజ్యానాయక్, హెడ్‌కానిస్టేబుళ్లు మహమూద్, సిబ్బంది వెంకట్, జాని, హోంగార్డు సైదులుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రభుత్వం సహకరించినా దక్కని ప్రాణాలు
► పాపం అంజయ్య..! ► ఇంప్లాంట్ వ్యాధితో మృతి నిడమనూరు : జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.16లక్షలు వైద్యం కోసం విడుదల చేసినా ఆ యువకుడి ప్రాణాలు నిలబడలేదు. మండలంలోని గారకుంటపాలెంకు చెందిన చింతపల్లి అంజయ్య(20) మూడు నెలలుగా ఇంప్లాంట్ ఎనిమా వ్యాధితో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అసలేం జరిగిందంటే... చింతపల్లి అంజయ్యది నిరుపేద కుటుంబం. అతనికి ఇంప్లాంట్ వ్యాధి సోకింది. జబ్బు నయం కావాలంటే అక్షరాల పదహారు లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో టీఆర్ఎస్ నాయకులు జొన్నటగడ్డ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ నర్సింహగౌడ్ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి పరిస్థితి వివరించారు. స్పందించి మంత్రి.. ముఖ్యమంత్రికి సిఫారసు చేసి సీఎం రిలీఫ్ ఫ్ండ్ నుంచి వైద్యఖర్చుల కోసం రూ.16లక్షలు మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌లో ఈనెల 2వ తేదీన చికిత్స మొదలు పెట్టారు. వైద్యులు రెండు వారాల పాటు శస్త్ర చికిత్సలు చేశారు. అయినా అంజయ్య ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా పరిస్థితి విషమించడంతో వైద్యులు అతన్ని ఇంటికి తీసుకెళ్లమని సూచించారు. దీంతో అంజయ్యను కుటుంబ సభ్యులు ఈనెల 16న స్వగ్రామానికి తీసుకువచ్చారు. మంత్రి చేసిన సాయానికి కృతజ్ఞతగా.. తన వైద్యఖర్చుల కోసం రూ.16 లక్షలు ఇప్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి సహాయానికి కృతజ్ఞతగా ఈనెల18న మంత్రి పుట్టిన రోజున అంజయ్య కేక్ కట్ చేశాడు. మూడు రోజులకే అంజయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
ఆ తాత అందర్నీ ఆకట్టుకున్నాడు..!
కాలేజీ విద్యార్థిని కెల్సే హార్మాన్ వారం క్రితం పోస్ట్ చేసిన ఆమె తాతగారి చిత్రం ఇంటర్నెట్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. మనవళ్ళతో సంతోషంగా, ఆనందంగా గడపాల్సిన ఆయన ముఖం ముడుచుకొని దీనంగా కూర్చోవడం ఆమెకు అత్యంత బాధ కలిగించింది. దీంతో తన ప్రియమైన తాతగారి ఫొటో తీసి ఆమె ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది. ఇంతకూ ఆతాతగారి బాధకు కారణం ఏమిటంటే... తన మనవళ్ళు ఆరుగురిలో ఐదుగురే తనతోపాటు విందుకు హాజరవ్వడం తీవ్ర నిరాశను మిగిల్చిందట. తాను స్వయంగా తయారు చేసిన హ్యాంబర్గర్లను వారికి అందించేందకు అందర్నీ విందుకు ఆహ్వానించిన తాతగారికి.. పిల్లల్లో ఇద్దరు రాకపోవడం ఎంతో ఆవేదన కలిగించిందట. దీంతో విచార వదనంతో ఉన్న ఆయన ఫొటోను తీసి సదరు మనుమరాలు ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది. ఇంకేముందీ అసలే ముసలాయన, అందులోనూ సంబంధ బాంధవ్యాలకు మంచి ప్రాముఖ్యతనిస్తూ అంత ఆప్యాయంగా పిల్లలకు వండి పెడితే వారు తినకపోవడం మరి బాధపెట్టే విషయమే కాదా? ఎంతైనా ప్రేమను పంచే తాతగార్ని వినియోగదారులు సైతం అలా చూస్తూ ఊరుకోలేకపోయారు. హార్మాన్ బాధను షేర్ చేసుకునేందుకు సామాజిక మాధ్యమంలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోకు వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రే తాతగారిపై అందరికీ అత్యంత అభిమానం పెరిగిపోయింది. మార్చి 16న ట్వీట్ చేసిన చిత్రం 1.7 లక్షల సార్లు రీట్వీట్ చేయడంతోపాటు 2.8 లక్షలమంది లైక్ లు కొట్టేశారు. దీంతో ఆ గ్రాండ్ పా నిజంగానే లక్షల మంది అభిమానం, ప్రేమ సంపాదించడంతోపాటు... ఇతర మనవళ్ళుకూడ కూడ వారి వారి తాతల విశేషాలను షేర్ చేసుకుకోవడం మొదలు పెట్ఆరు. -
అది చాలా బాధాకరం: ఎంపీ కవిత
బంజారాహిల్స్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవడం బాధకరమని, ఈ విషయంలో తాను కూడా ప్రశ్నించే వారిలో ఒకరిగా ఉంటానని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో శుక్రవారం ఫిక్కి ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో జరిగిన ‘భవిష్యత్తు భారతంలో మహిళల ముందంజ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గంలో మహిళల ప్రాతినిథ్యం లేదంటూ ఓ ఫిక్కీ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు కవిత ఈ విధంగా స్పందించారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న రాష్ర్టంలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని, దీనికితోడు అన్ని సమీకరణాల నేపథ్యంలో అవకాశం దక్కలేదని చెప్పారు. అయితే ఇది కొంత బాధించదగ్గ విషయమేనన్నారు. గతంతో పోల్చుకుంటే మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. ముఖ్యమైన కార్పొరేట్, రాజకీయ పదవుల్లో మహిళలు కీలకస్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. భారత్‌లో మహిళల సంఖ్య అధికంగా ఉందని, అందులో 21 సంవత్సరాలలోపు ఉన్న మహిళల సంఖ్య 20 శాతం ఉందన్నారు. ఇంకా పలువురు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్పర్సన్ సామియాఆలంఖాన్‌తోపాటు సభ్యులు పింకీరెడ్డి, పార్వతిరెడ్డి, రేఖారెడ్డి, కామిని షరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల అనుమతి ఉండాల్సిందే
భూసేకరణపై పార్లమెంటరీ కమిటీకి తెలిపిన అకాలీదళ్, స్వాభిమాని పక్ష పార్టీలు అంగీకారం లేకుంటే అంగుళం కూడా సేకరించొద్దు 70 శాతం రైతుల అనుమతి ఉండాలని ఇప్పటికే తెలిపిన శివసేన న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సవరణ బిల్లులో మార్పులు చేయాల్సిందేనని శివసేన ఇప్పటికే స్పష్టంచేయగా.. తాజాగా శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), స్వాభిమాని పక్ష పార్టీలు అదే తీరులో స్పందించాయి. ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. భూసేకరణకు 70 శాతం రైతుల అనుమతి తప్పనిసరి చేస్తూ బిల్లులో నిబంధన చేరిస్తేనే మద్దతిస్తామని శివసేన ఇప్పటికే బీజేకి స్పష్టంచేసింది. రైతులు ఒప్పుకోనిదే అంగుళం భూమి కూడా సేకరించకూడదని అకాలీదళ్, స్వాభిమాని పక్ష పార్టీలు తాజాగా ఎస్ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని సంయుక్త కమిటీకి నివేదించాయి. అకాలీ తరఫున నరేశ్ గుజ్రాల్, బల్విందర్ సింగ్ భుందర్, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా, ప్రేంసింగ్ చందుమాజ్రా, షేర్ సింగ్ గుబాయలు కమిటీకి లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయం తెలిపారు. రైతులకు భూమి అనేది అమూల్యమైనదిగా తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు/భూయజమానుల అనుమతి లేనిదే అంగుళం భూమి కూడా సేకరించొద్దని అన్నారు. సర్కారు ప్రాజెక్టులకు మాత్రమే ప్రభుత్వం భూసేకరణ జరిపేలా చూడాలన్నారు. రైతులు కోర్టుకు వెళ్లే హక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాకరించవద్దని సూచించారు. పరిహారాన్ని భూయజమానులకే కాకుండా ఆ భూమిపై ఆధారపడే కూలీలకు కూడా ఇవ్వాలన్నారు. భూసేకరణకు 70 శాతం రైతుల అభిప్రాయం తప్పనిసరి చేయడంతోపాటు పీపీపీ ప్రాజెక్టుల కోసం భూమి సేకరిస్తే ఐదు రెట్ల పరిహారం ఇవ్వాలని స్వాభిమాని పక్ష పార్టీ ఎంపీ రాజుషెట్టీ సూచించారు. ప్రస్తుత బిల్లులో ఈ పరిహారం నాలుగు రెట్లు మాత్రమే ఉంది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన శివసేనకు లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్నారు. శిరోమణి అకాలీదళ్‌కు లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్నారు. ఇక స్వాభిమాని పక్ష తరఫున రాజుషెట్టీ ఒక్కరే లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
ఒకవైపు దు:ఖ౦ మరోవైపు స౦తోష౦
-
విదేశాల నుంచి వచ్చి విషాదం మిగిల్చి..
శంషాబాద్, న్యూస్‌లైన్: తల్లికి ఓటేసేందుకు విదేశాల నుంచి వచ్చి ఓ వ్యక్తి తన కుమారుడిని కోల్పోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. శంషాబాద్ ఎంపీటీసీ అభ్యర్థిగా రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున జులేకాబేగం పోటీలో ఉన్నారు. ఆమె రెండో కుమారుడు రఫీయుద్దీన్ సౌదీ అరేబియాలోని మదీనాలో మొబైల్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లి ఎన్నికల బరిలో ఉండడంతో రఫీ శుక్రవారం ఉదయం భార్యాపిల్లలతో స్వస్థలానికి బయలుదేరాడు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగాక క్యాబ్ తీసుకొని ఇంటికి వచ్చాడు. రఫీయుద్దీన్ కుమారుడు దానీష్ అహ్మద్(3) ఇంట్లోకి వెళ్లి నానమ్మతో పాటు అందరిని పలకరించి తిరిగి కారు వద్దకు వచ్చాడు. అప్పటికి తల్లిదండ్రులు సామాన్లు తీసుకొని ఇంట్లోకి వెళ్తున్నారు. డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో చిన్నారి కారు చక్రాల కిందపడి అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. శుక్రవారం బాలుడి పుట్టిన రోజు కూడా కావడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
నవయువం : విజేతలు వద్దంటున్నారు..!
‘ఆశావాదాన్ని అస్త్రంగా చేసుకో... నిరాశ దరిచేరినా భయపడకు... నీకు అసాధ్యం అనేది ఉండదు...’ ఆనందం, బాధ... జీవితాన్ని చెరో చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటాయట. ఆనందానికి అప్పుడప్పుడన్నా అలసట ఉంటుంది కానీ, బాధ మాత్రం తరచూ పలకరిస్తుంటుంది. బాధలు, కష్టాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో స్థాయిలో ఉండొచ్చు. కానీ ఈ స్థాయితో సంబంధం లేకుండా చాలామంది తమ చిన్న చిన్న బాధలను మాత్రమే తలుచుకొని తమను ఆనందం కూడా ఒక చేయిపట్టుకొని నడిపిస్తోందన్న విషయాన్ని మరిచిపోతున్నారు! అమూల్యమైన జీవితానికి విషాదభరితమైన ముగింపు ఇస్తున్నారు. తాము కష్టాలుగా భావిస్తున్నవాటిని ఎదుర్కొని బతకాలంటే స్ఫూర్తి కావాలి. అలాంటి స్ఫూర్తిని చాలామంది పెద్దవాళ్లు తమ మాటలతో, జీవితాలతో పంచారు. ఆ మాటల్లో కొన్ని... ‘‘నీకు భవిష్యత్తు మీద ఆశను ఇచ్చాను, ఆరోగ్యాన్ని, మేధస్సును, ఎన్నో అవకాశాలను ఇచ్చాను. కానీ నువ్వు నాకు తిరిగి ఇచ్చిందేమిటి? నిరాశా! ఒక్కసారి ఆలోచించు, అంతర్మథనం చేసుకో, అప్పుడు దమ్ముంటే చావడానికి ప్రయత్నించు...’’ అంటూ ‘ప్రకృతి’ చేత చెప్పిస్తాడు ‘ది సూసైడ్ ఆర్గ్యుమెంట్’ అనే కవితలో ఆంగ్ల కవి కాల్రిడ్జ్. అందమైన జీవితానికి ఆత్మహత్య అనే పరిష్కారం ఇచ్చిన వారిని నిరసిస్తూ, ఇవ్వాలనుకొనే వారిని నిందిస్తాడు కాల్రిడ్జ్. ఎడిసన్ పంచిన కాంతి.. ‘‘విఫలం అయ్యామని బాధపడే వారి విషయంలో విషాదం ఏమిటంటే.. వారికి తెలీదు... తాము విజయానికి ఎంత దగ్గరగా వచ్చామో. విజయతీరాల వద్దకు వెళ్లి కూడా, వైఫల్యం చెందామనుకుని తొందరపడి వారు పట్టు వదిలేస్తుంటారు... ’’ అంటాడు థామస్ ఆల్వా ఎడిసన్. సక్సెస్ సీక్రెట్‌ను వివరిస్తూ ఎడిసన్ ఈ మాటలు చెప్పాడు. సహనం ఉంటే అద్భుతమైన తీరాలకు చేరే అవకాశం ఉన్నప్పటీ అర్ధాంతరంగా తనువులను చాలించే వారి జీవితాలకు కూడా ఈ మాటలను అన్వయించవచ్చు. బల్బ్‌ను ఆవిష్కరించి ప్రపంచానికి దీపాన్ని బహుమతిగా వచ్చి ఎడిసన్ మాటల్లో కాంతి కనిపిస్తుంది. నిరాశను లెక్కచేయకండి... ‘‘ఓడిపోకుండా, నిరాశ లేకుండా బతకడం గొప్ప కాదు, అలాంటి పరిస్థితుల్లోంచి కూడా కొత్త ఆశతో పైకి ఎదగడమే నిజమైన గొప్పదనం...’’ అంటాడు నెల్సన్ మండేలా. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడి 27 సంవత్సరాల పాటు కారాగారంలోనే బతికిన మండేలా ఏనాడూ తనకు ఆత్మహత్య ఆలోచన రాలేదని గర్వంగా చెప్పాడు. విడుదల ఎప్పుడో తెలీదు, బయట ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందో లేదో కూడా తెలీదు. అయినా తన దీనస్థితికి కుమిలిపోలేదు. ‘‘ఆశావాదాన్ని అస్త్రంగా చేసుకో... నిరాశ దరిచేరినా భయపడకు... నీకు అసాధ్యం అనేది ఉండదు...’’ అంటాడు ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు క్రిస్టఫర్రీవ్. ‘సూపర్‌మ్యాన్’ సినిమాతో ప్రపంచానికి పరిచయం ఉన్న రీవ్ ఒక ప్రమాదంలో వికలాంగుడయ్యాడు. ఆ వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన ఆత్మహత్యేనట. అయితే తన ఆలోచన తీరును తనే మార్చుకొని, నిస్పృహ నుంచి బయటకు వచ్చి ఎన్నో జీవితాలకు స్ఫూర్తిని పంచాడు రీవ్. జీవితం గొప్పది, బంధాలు పెనవేసుకొన్న బతుకు ఉన్నతమైనది... ఎంతోమంది విజేతలు తమ జీవితాలతో ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఇది. విధిని ఎదుర్కొని సాగించాల్సిన విజయ ప్రస్థానానికి స్ఫూర్తి ఇది. - జీవన్