ఢిల్లీ నేతలకు నేనంటే ద్వేషం : ఒమర్‌ | Omar Abdullah accuses BJP-led Centre of trying to silence him | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నేతలకు నేనంటే ద్వేషం : ఒమర్‌

Sep 7 2024 5:48 AM | Updated on Sep 7 2024 5:48 AM

Omar Abdullah accuses BJP-led Centre of trying to silence him

శ్రీనగర్‌: జమ్మూకశీ్మర్‌లో ఎన్నికల వేళ బీజేపీ అగ్రనాయకత్వంపై నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం గాందర్‌బల్‌ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో ఒమర్‌ మాట్లాడారు. ‘‘ ఢిల్లీలో ఉన్న నేతలకు నేనంటే ద్వేషం. 

ఎన్నికల్లో ఓడించి నా నోరు మూయించాలని చూస్తున్నారు. పని గట్టుకుని స్వతంత్య అభ్యర్థులను నాపై పోటీకి నిలుపుతున్నారు. నన్ను ఓడించి చట్టసభల్లో నా గొంతు వినపడకుండా చేయాలని కుట్ర పన్నారు. ఢిల్లీ నేతలపై నేను పోరాడుతున్నది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు. జమ్మూకశ్మీర్‌ పౌరుల కోసం. నేనేం మాట్లాడిన ప్రజల గొంతుక వినిపిస్తా’’ అని ఒమర్‌ అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement