‘మోదీ మీ పాత్రలో సల్మాన్‌ ఐతే బాగుండేది’ | Omar Abdullah Said Salman Khan Hota Toh Kya Maza Aata | Sakshi
Sakshi News home page

‘మోదీ మీ పాత్రలో సల్మాన్‌ ఐతే బాగుండేది’

Jan 8 2019 8:57 PM | Updated on Jan 8 2019 8:57 PM

Omar Abdullah Said Salman Khan Hota Toh Kya Maza Aata - Sakshi

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్‌తోనే ఈ సినిమా వివాదాలను రేపుతోంది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వివేక్‌ ఒబేరాయ్‌ మోదీ పాత్రలో నటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. అయితే ఈ పోస్టర్‌ పట్ల ఇప్పటికే పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వివేక్‌ ఒబేరాయ్‌ మోదీ పాత్రను దారుణంగా ఖూనీ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇప్పుడు వీరి వరుసలో జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కూడా చేరారు. ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ పినిస్టర్‌ సినిమాను, మోదీ బయోపిక్‌ను కంపేర్‌ చేస్తూ అబ్దుల్లా కామెంట్‌ చేశారు. ‘మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ బాగానే సూట్‌ అయ్యారు.. కానీ మోదీ మీ పాత్ర కోసం వివేక్‌ అంతగా సెట్‌ అవ్వలేదు. వివేక్‌ బదులు మీరు సల్మాన్‌ ఖాన్‌ తీసుకుంటే మజా వచ్చేది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement