జమ్మూకశ్మీర్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు చేసిన పనికి ప్రాంతం మెుత్తాన్ని నిందిస్తున్నారని అక్కడి సీఎం ఒమర్ అబ్దుల్లా అసహానం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు ఎక్కడా ఉండే విధంగా లేదని ఎక్కడికెళ్లినా వారిని అనుమానంగా చూస్తున్నారని అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు దాడిలో జమ్మూకశ్మీర్ ప్రాంతానికి చెందిన వ్యక్తులను ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు." ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనకు కొంతమంది బాధ్యులు. కాని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంతంలోని వ్యక్తులంతా కారణం అన్నట్లున్నాయి. జమ్మూకశ్మీర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఢిల్లీలో తిరగడం నేరం అన్నట్లు చూస్తున్నారు. నేను ఆ ప్రాంతంలో తిరిగినా ఎవరూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేలా పరిస్థితులు కన్పిస్తున్నాయి" అని ఆయన అన్నారు.
2019లో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు అంతా ఆగిపోతుందని కేంద్రం చెప్పింది కానీ ఏమీ ఆగలేదు. ఒకవేళ ఢిల్లీలో బాంబుబ్లాస్ట్ జరిగి ఉండక పోతే తమ దగ్గర జరిగేదని జమ్మూ ఎంతో హింసను చూసిందని బాంబుల దాడులతో జమ్మూ ప్రజలు మరణించడం ఇంకా ఆగలేదని ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులెవరూ పిల్లలను తమ ప్రాంతం వదిలి బయిటకు పంపించేలా లేరని ఒమర్ తెలిపారు.
కాగా ఎర్రకోట బాంబుదాడి ఘటనపై ఆయన తండ్రి ఫరుూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డాక్టర్లు ఈ మార్గం ఎందుకు ఎన్నుకున్నారు. దానికి కారణం ఏమిటి? దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన అన్నారు.


