పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఎప్పటినుంచంటే? | Union Budget for 2026 is expected on February 1 | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఎప్పటినుంచంటే?

Jan 6 2026 12:27 PM | Updated on Jan 6 2026 1:13 PM

Union Budget for 2026 is expected on February 1

ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడనుంది. తొలిసారిగా సభలో ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం చర్చాంశనీయంగా మారింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానం  వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చ, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లులపై చర్చ జరగనుంది. ఈ బిల్లులు ప్రవేశపెట్టబడితే, దేశ రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement