
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సాహసం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని నక్ష్ బంద్ సాహిబ్ కబరస్తాన్ వద్ద సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1931 జూలై 13న డోగ్రా ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయిన 22 మంది సమాధులు ఇందులోనే ఉన్నాయి. ముఖ్యనేతలెవరూ ఇక్కడికి నివాళులరి్పంచడానికి రాకూడదని యంత్రాంగం సీఎం ఒమర్ సహా పలువురు నేతలను ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే, సోమవారం సీఎం ఒమర్ సహా పలువురు నేతలు అక్కడికి చేరుకున్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆటోలో, విద్యామంత్రి సకినా ఇట్టూ స్కూటీపై వచ్చారు. కబరస్తాన్‌కు దారి తీసే రెండు వైపులా దారుల్నీ అధికారులు మూసివేశారు. ఖన్‌య్రాŠ ప్రాంతానికి చేరుకున్న సీఎం ఒమర్ తన వాహనం దిగి అరకిలో మీటర్ దూరంలో ఉన్న కబరస్తాన్‌కు కాలినడకన చేరుకున్నారు. కబరస్తాన్‌కు తాళంవేసి ఉంచడంతో ఇనుప గేటు పైకెక్కి లోపలికి చేరుకున్నారు. కొందరు నేతలు కూడా ఆయన్ను అనుసరించారు. కొద్దిసేపటికి అధికారులు గేట్లు తెరిచారు.
దీంతో, ఫరూక్ అబ్దుల్లా తదితరులు కూడా వచ్చి అమరుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు సోమవారం తనను ఎందుకు ఆపారంటూ మండిపడ్డారు. వాళ్లు మమ్మల్ని బానిసలని అనుకుంటున్నారు. కానీ, మేం ప్రజలు మాత్రమే సేవకులం. యూనిఫాంలో ఉన్న పోలీసులు చట్టం మర్చిపోతున్నారు. పరుగెత్తుతున్న మమ్మల్ని వెంటాడారు. మా చేతిలోని జెండాను చింపేయాలని చూశారు’అని ఆరోపించారు.