11 మంది మావోయిస్టుల లొంగుబాటు | 11 Naxalites with Rs 68 lakh bounty surrender in Maharashtra | Sakshi
Sakshi News home page

11 మంది మావోయిస్టుల లొంగుబాటు

Mar 19 2026 9:23 PM | Updated on Mar 19 2026 9:23 PM

 11 Naxalites with Rs 68 lakh bounty surrender in Maharashtra

ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 11 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో ఐదుగురు సీనియర్‌ నేతలు కూడా ఉన్నారు. 11 మంది మావోయిస్టులు తూర్పు గడ్చిరోలిలో పోలీసులు, కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాల ముందు లొంగిపోయినట్లు పోలీసులు వివరించారు.

ఆ మావోయిస్టులపై మొత్తం కలిపి రూ.68 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. గడ్చిరోలి జిల్లాలో వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) దాదాపు ముగింపునకు వచ్చిందని తెలిపారు.  

కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు, అడవుల్లో చాలా మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. 

Advertisement
 
Advertisement
Advertisement