నిర్బంధం నుంచి ఒమర్‌ అబ్దుల్లా విడుదల

National Conference Leader Omar Abdullah Released After Eight Months - Sakshi

8 నెలల తర్వాత బయటకు వచ్చిన ఎన్‌సీ నేత

శ్రీనగర్‌: జమ్మూ, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్‌ సేఫ్టీ చట్టం కింద ఆయనను 8 నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు, ఆయన మద్దతుదారులు ఆయన ఇంటి ముందు మాస్కులు ధరించి ఎదురుచూశారు. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్‌ హౌస్‌ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. అయితే పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top