సాక్షి నెల్లూరు : కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. సోమశిల డ్యామ్ పరిశీలనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలు కాకాణి చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిలను అడ్డుకున్నారు.
ఈరోజు (శనివారం) సోమశిల డ్యామ్ పరిశీలనకు వెళ్లాలని చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి కార్యక్రమం రూపొందించారు. అయితే వారి పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆనేతలను అక్రమంగా హౌస్ అరెస్టు చేశారు. అనంతరం వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.


