క్లీన్‌ స్వీప్‌ మిస్‌.. బీజేపీకి ‘క్రాస్‌ ఓటింగ్‌’ విక్టరీ! | Jammu Kashmir Rajya Sabha Election 2025 Results Declared | Sakshi
Sakshi News home page

జమ్ము ఎన్నికల్లో అనూహ్యం: క్లీన్‌ స్వీప్‌ మిస్‌.. బీజేపీకి ‘క్రాస్‌ ఓటింగ్‌’ విక్టరీ!

Oct 25 2025 7:15 AM | Updated on Oct 25 2025 7:20 AM

Jammu Kashmir Rajya Sabha Election 2025 Results Declared

కేంద్ర పాలిత జమ్ము కశ్మీర్‌ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి(Jammu Rajya Sabha Results). అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌ క్లీన్‌ స్వీప్‌ మిస్‌ అయ్యింది. నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. క్రాస్‌ ఓటింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలు ఇవే. 

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో శుక్రవారం(అక్టోబర్‌ 24వ తేదీన) ఓటింగ్‌ జరిగింది. 88 మంది ఎమ్మెల్యేలకు గానూ.. 86 మంది నేరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆప్‌ ఎమ్మెల్యే మెహరాజ్‌ మాలిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. కాంగ్రెస్‌, పీడీపీ, సీపీఐ(ఎం), ఏఐపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.

ఎన్‌సీ తరఫున చౌదరి మహ్మద్‌ రంజాన్, సజ్జాద్‌ కిచ్లూ, జీఎస్‌ ఒబెరాయ్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ సత్‌ పాల్‌ శర్మ(Sat Paul Sharma) విజేతలుగా నిలిచారని అసెంబ్లీ సెక్రటరీ ఎంకే పండిత తెలిపారు. 

నాలుగో సీటు కోసం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఇమ్రాన్‌ నబీ, సత్‌ శర్మ పోటీ పడ్డారు. అయితే  32 ఓట్లతో శర్మ విజయం సాధించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. జమ్ము అసెంబ్లీలో బీజేపీకి కేవలం 28 సీట్లు మాత్రమే ఉండగా.. 4 అదనపు ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ఊహించినట్లుగానే.. స్వతంత్రులు వాళ్ల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆ నాలుగు ఓట్లు ఎక్కడివి? అంటూ ఓ ట్వీట్‌ చేశారు. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డ(Cross Voting For BJP) ఆ నలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక..

డోడా నియోజకవర్గ ఆప్‌ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్‌ పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద సెప్టెంబర్ 8, 2025న అరెస్ట్ అయ్యారాయన. ఆయన ప్రస్తుతం కథువా జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు.  

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రం కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది.  ఛండీగఢ్‌, లక్షద్వీప్‌ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు. కాబట్టి వాటికి రాజ్యసభ స్థానాలు ఉండవు. అయితే.. 2020లో జమ్ము కశ్మీర్ రీజనల్ అసెంబ్లీ తిరిగి ఏర్పడింది. అందువల్ల ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికలు మళ్లీ అసెంబ్లీలోనే జరిగాయి. అంతా ఊహించినట్లుగానే అధికార పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement