శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2001లో పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఘటనలోని దోషి అఫ్జల్‌గురుకు మరణశిక్ష విధించటంలో ఎటువంటి ప్రయాజనం లేదని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
‘అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించటంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో శిక్ష విధించాల్సి ఉండేది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయటంపై వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరులేదని నమ్ముతున్నా. ఉరిశిక్ష విధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే కోర్టులు సైతం వందశాతం సరైన తీర్పులు వెల్లడిస్తాయని భావించలేము. మాకు సాక్ష్యాలను పదేపదే చూపించారు. ఇలా ఉరి శిక్ష విధించటాన్ని మాత్రం ఇతర దేశాలు సమర్థించలేదు’ అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలవేళ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బాల్, బుద్గామ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలలోను విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
డిసెంబర్13, 2001న పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్ 26, 2006న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అఫ్జల్ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు.దీంతో ఫిబ్రవరి 9, 2013న ఢిల్లీలోని తిహార్ జైలులో అఫ్జల్ గురుకి మరణశిక్ష అమలుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment